మిచౌంగ్ తుఫాన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.
ED Officer Ankit Tiwari Arrest: లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ఓ ఈడీ అధికారి. ఓ వ్యక్తి నుంచి రూ. 20 లక్షలను లంచం తీసుకుంటూ పోలీసులు చిక్కాడు. దీంతో అతడి అరెస్టు చేసి విచారిస్తున్నారు తమిళనాడు పోలీసులు. ప్రస్తుతం మనీ లాండరింగ్ కేసులో తమిళనాడుకు చెందిన పలువురు రాజకీయ నాయకులపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో ఈడీ సీనియర్ ఆఫీసర్ అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. వివరాలు.. ఈడీ సీనియర్ ఆఫీసర్ అంకిత్ తివారి దిండిగల్ ప్రాంతంలో…
తమిళనాడులోని జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి కేరళ వెళ్తుండగా బస్సులో మంటలు చెలరేగాయి. ధర్మపురి-సేలం జాతీయ రహదారిపై గెంగాళాపురం ప్రాంతంలో బస్సులో మంటలు చెలరేగాయి. అయితే ఆ బస్సు అందరూ చూస్తుండగానే.. మంటల్లో దగ్ధమైంది.
Heavy Rainfall:తమిళనాడు, కేరళలోని పలు జిల్లాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షాల కారణంగా తమిళనాడులోని పలు జిల్లాల్లో కూడా కొండచరియలు విరిగిపడడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
Tamil Nadu: తమిళనాడులోని ఇద్దరు అధ్యాపకులు సున్నితమైన అంశాన్ని వివాదంగా మార్చారు. కోయంబత్తూర్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిని గొడ్డుమాంసం తిన్నందుకు వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బీఫ్ తిన్నందుకు తమన చిన్నారిని ఉపాధ్యాయులు వేధించడమే కాకుండా కొట్టారని సదరు కుటుంబం ఆరోపించింది.
IMD Alert: రానున్న మూడు రోజుల్లో తమిళనాడులోని 18కి పైగా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ మార్పుల కారణంగా తమిళనాడులోని 18 జిల్లాలకు పైగా రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ఒక ప్రకటనలో తెలిపింది.
నేడు జరిగిన అసెంబ్లీ సమావేశంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక తీర్మానం ప్రవేశ పెట్టారు. గతంలో అమోదం పొందిన సుమారు 10 బిల్లులను పాస్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆర్ఎన్ రవి చర్యలు తీసుకోవాలి కోరారు. 2020, 2023లో రెండు బిల్లులకు ఆమోదం దక్కిందని, మరో ఆరు బిల్లులు గత ఏడాది పాస్ చేశామని, కానీ ఇంత వరకు గవర్నర్ ఆ బిల్లులకు ఓకే చెప్పలేదని స్టాలిన్ పేర్కొన్నారు. ఎటువంటి కారణాలు లేకుండానే గవర్నర్…
Tamil Nadu: తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ సీఎంగా పోరు జరుగుతోంది. ఇటీవల పంజాబ్ గవర్నర్ భన్వరీ లాల్ పురోహిత్ వ్యవహార శైలిపై, అక్కడి ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ పురోహిత పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడం లేదని సీఎం భగవంత్ మాన్ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు నిప్పుతో చెలగాలమాడుతున్నారని మండిపడింది. ఈ కేసు విచారణ సందర్భంగా తమిళనాడు…
Chennai Fire: తమిళనాడు రాజధాని చెన్నైలోని మైలాపూర్ సాయిబాబా ఆలయ పైకప్పుపై దీపావళి సాయంత్రం మంటలు చెలరేగాయి. మూడు అగ్నిమాపక కేంద్రాలకు చెందిన 20కి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నారు.