MK Stalin: తమిళనాడులో గవర్నర్ వర్సెస్ డీఎంకేగా వ్యవహారం నడుస్తోంది. అధికార డీఎంకే పార్టీ నేతలు, ముఖ్యంగా సీఎం ఎంకే స్టాలిన్ గవర్నర్ ఆర్ఎన్ రవిని టార్గెట్ చేస్తున్నారు. తమిళనాడు నుంచి వెళ్లిపోవాలంటూ గతంలో డీఎంకే శ్రేణులు పోస్టర్లు కూడా అంటించారు. ఇటీవల రాజ్ భవన్ ప్రధాన గేటు ముందర ఓ వ్యక్తి పెట్రోల్ బాంబులను పేల్చడం మరోసారి రెండు వ్యవస్థల మధ్య ఘర్షణకు కారణమైంది. బీజేపీ చీఫ్ అన్నామలై, డీఎంకే పార్టీనే ఇలా స్పాన్సర్ చేస్తూ దాడులకు ఉసిగొలుపుతుందని ఆరోపించారు.
Read Also: Love Story: లవర్‌ని పెళ్లి చేసుకునేందుకు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ యువతి..
ఇదిలా ఉంటే గవర్నర్ ఆర్ఎన్ రవి 2024 లోక్‌సభ ఎన్నికల వరకు పదవిలో కొనసాగాలని సీఎం స్టాలిన్ శుక్రవారం అన్నారు. చెన్నైలోని ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయన పార్లమెంట్ ఎన్నికలు జరిగే వరకు ఆయన్ను కొనసాగించాలని ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కోరారు. డీఎంకే ఎన్నికల ప్రచారానికి గవర్నర్ సాయం చేస్తున్నారంటూ స్టాలిన్ సెటైర్లు వేశారు.
పదే పదే ద్రవిడం అంటే ఏమిటనే వ్యక్తిని(గవర్నర్ ఆర్ఎన్ రవి)ని కొనసాగనివ్వండి, ఇది మా ప్రచారానికి బలం చేకూరుస్తుంది. ఆయన మనసుకు నచ్చినవన్నీ మాట్లాడుతున్నారు, కానీ ప్రజలు దీన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని స్టాలిన్ అన్నారు. గవర్న్ ను ఉద్దేశిస్తూ హై పోస్టులతో రాజ్ భవన్ లో కూర్చున్న కొందరు వ్యక్తులు ద్రవిడం అంటే ఏమిటి అని అడుగుతున్నారు..? అసలు ద్రవిడం అంటే ఏమిటని స్టాలిన్ ప్రశ్నించారు.