Diwali: దేశం అంతటా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాలు పటాకుల సందడితో, తారాజువ్వల వెలుగులతో అందంగా మారాయి. అయితే తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని 7 గ్రామాలు మాత్రం నిశ్శబ్ద దీపావళిని జరుపుకుంటారు. కాంతి వెలుగులు లేకుండా, శబ్ధాలు రాకుండా ఈ గ్రామాల్లో దీపావళి జరుగుతుంది.
Wife kills husband: తమిళనాడులో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య అత్యంత దారుణంగా హత్య చేసింది. ప్రియుడి మోజులో పడిన సదరు ఇల్లాలు అతడితో కలిసి భర్తను కడతేర్చింది. తిరుచ్చి పోలీసులు ఈ హత్యకు పాల్పడిన మహిళ వినోదిని(26), ఆమె లవర్ భారతి(23)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జంటకు సహకరించిన మరో ముగ్గుర్ని కూడా అరెస్ట్ చేశారు.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేటు బస్సులు ఢీ కొట్టుకోవడంతో నలుగురు మరణించారు. ఇక, ఈ ప్రమాదంలో 60 మందికి గాయాలు అయ్యాయి.
K Annamalai: బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కే అన్నామలై సంచలన ప్రకటన చేశారు. తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తే ఆలయాల ముందు ఉన్న పెరియార్ విగ్రహాలను తొలగిస్తామని ప్రకటించారు. శ్రీరంగంలో జరిగిన ర్యాలీలో అన్నామలై ఈ ప్రకటన చేశారు. 1967లో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల ముందు శిలాఫలకాలు ఏర్పాటు చేసి..‘‘ దేవుళ్లను అనుసరించే వారు మూర్ఖులు.. దేవున్ని నమ్మే వారు మోసగించబడుతారు. కాబట్టి దేవున్ని పూజించకండి’’ ప్రచారం చేశారని, అంతకుముందు ఈ బోర్డులు…
Diwali Surprise: దీపావళికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ప్రతీ కంపెనీ కూడా తన ఉద్యోగులకు బోనస్లు, గిఫ్టులు, స్వీట్లు అందచేస్తు్న్నాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులకు మరిచిపోలేని కానుకలను ఇస్తోంది. కార్లు, బైకులను అందించి సర్ప్రైజ్ చేస్తున్నాయి. హర్యానాలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీల తన ఉద్యోగులకు కార్లను అందించింది.
Father kills daughter for marrying a poor man in Tamil Nadu: తమిళనాడులోని తూత్తుకూడి జిల్లాలో గురువారం దారుణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన మూడో రోజే ఓ యువ జంటను కొందరు అతి కిరాతకంగా హత్యచేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య కేసులో పోలీసులు అనుమానించిందే నిజమైంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కుమార్తెను ఆమె తండ్రే హత్య చేశాడు. పేదవాడిని పెళ్లి చేసుకున్నందుకే తన…
New Couples killed 3 days after wedding in Tamil Nadu: తమిళనాడులోని తూత్తుకూడి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో.. సొంత కుటుంబ సభ్యులే ఓ యువతి, యువకుడిని దారుణంగా చంపారు. నిద్రిస్తున్న సమయంలో ఇంటిలోకి చొరబడిన యువకులు.. కొత్త జంటను దారుణంగా చంపేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు దీనిని పరువు హత్యగా భావిస్తున్నారు. తూత్తుకూడికి చెందిన కార్తీక (20), సేల్వం (24)…
MK Stalin: తమిళనాడులో గవర్నర్ వర్సెస్ డీఎంకేగా వ్యవహారం నడుస్తోంది. అధికార డీఎంకే పార్టీ నేతలు, ముఖ్యంగా సీఎం ఎంకే స్టాలిన్ గవర్నర్ ఆర్ఎన్ రవిని టార్గెట్ చేస్తున్నారు. తమిళనాడు నుంచి వెళ్లిపోవాలంటూ గతంలో డీఎంకే శ్రేణులు పోస్టర్లు కూడా అంటించారు. ఇటీవల రాజ్ భవన్ ప్రధాన గేటు ముందర ఓ వ్యక్తి పెట్రోల్ బాంబులను పేల్చడం మరోసారి రెండు వ్యవస్థల మధ్య ఘర్షణకు కారణమైంది. బీజేపీ చీఫ్ అన్నామలై, డీఎంకే పార్టీనే ఇలా స్పాన్సర్ చేస్తూ…
మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో కారుక వినోద్ అనే వ్యక్తి రాజ్ భవన్ ప్రధాన గేటు వద్ద పెట్రోల్ బాంబులను విసిరాడు. 2022లో చెన్నైలోని బీజేపీ కార్యాలయం వద్ద బాంబులు విసిరిన కేసులో కూడా వినోద్ అరెస్టయ్యాడు. ఈకేసులో మూడు రోజుల క్రితమే విడుదయ్యాడు.
పండగపూట తమిళనాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువణ్ణామలై సమీపంలోని సెంగం పక్రిపాళయం సెంగం బైపాస్ వద్ద బస్సు, సుమో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సును కారు ఢీకొట్టడంతో ఘటన చోటుచేసుకుంది.