తమిళనాడులో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నటి, బీజేపీ నాయకురాలు గౌతమి తాడిమళ్ల బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని గౌతమి తాడిమళ్ల లేఖ ద్వారా తెలియజేశారు. చాలా బరువెక్కిన హృదయంతో బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు గౌతమి తాడిమళ్ల లేఖలో పేర్కొన్నారు.
Read Also: Top Headlines @9AM: టాప్ న్యూస్
గత 25 సంవత్సరాల క్రితం దేశ నిర్మాణానికి దాని ప్రయత్నాలను అందించడానికి బీజేపీ పార్టీలో చేరాను అని గౌతమి తాడిమళ్ల లేఖలో పేర్కొన్నారు. నా జీవితంలో నేను ఎదుర్కొన్న అన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, నేను ఆ నిబద్ధతను గౌరవించాను.. అయితే ఈ రోజు నేను నా జీవితంలో ఊహించలేని సంక్షోభం నెలకొంది.. పార్టీ నుంచి, నేతల నుంచి నాకు ఎలాంటి మద్దతు లభించలేదు అని ఆమె తెలిపారు. తనను నమ్మించి మోసం చేసిన వ్యక్తికి కొందరు మద్దతిస్తున్నారని తెలిసింది అందుకే బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని గౌతమి తాడిమళ్ల లేఖలో ఆరోపించారు.