Diwali Surprise: దీపావళికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ప్రతీ కంపెనీ కూడా తన ఉద్యోగులకు బోనస్‌లు, గిఫ్టులు, స్వీట్లు అందచేస్తు్న్నాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులకు మరిచిపోలేని కానుకలను ఇస్తోంది. కార్లు, బైకులను అందించి సర్‌ప్రైజ్ చేస్తున్నాయి. హర్యానాలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీల తన ఉద్యోగులకు కార్లను అందించింది.
ఇదిలా ఉంటే తమిళనాడులోని టీ ఎస్టేట్ కంపెనీ తన ఉద్యోగులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను అందించింది. తమ యజమాని అందించిన గిఫ్టుతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీలగిరి జిల్లాలోని కోటగిరి పట్టణంలోని టీ ఎస్టేట్ తన ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల్ని బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచింది.
Read Also: NZ vs PAK: న్యూజిలాండ్-పాకిస్తాన్ మ్యాచ్కు వర్షం అడ్డంకి.. రద్దైతే ఆ జట్టుకే గెలుపు అవకాశం..!
ఉద్యోగులకు బైక్ కీలు అందిస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్‌గా మారింది. 42 ఏళ్ల టీ ఎస్టేట్ ఓనర్ శివకుమార్ కూడా తన ఉద్యోగులతో కొత్త బైకులపై జాయ్ రైడ్‌కి వెళ్లారు. దీనిపై ఉద్యోగులు మాట్లాడుతూ.. తాము ఇలాంటి గిఫ్టులను ఎప్పుడూ ఆశించలేదని, మా యజమాని 15 రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల్ని కానుకగా ఇచ్చారని, దీన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని చెబుతున్నారు.
దీనికి ముందు హర్యానా పంచకులలోని మిట్స్‌కార్ట్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ చైర్మన్ ఎంకే భాటియా 12 మంది ఉద్యోగులకు టాటా పంచ్ కార్లను బహూకరించారు. ఇందులో ఆఫీస్ బాయ్ కూడా ఉన్నారు. తన ఉద్యోగుల అంకితభావం, కృషికి తాను గిఫ్టులు ఇవ్వాలని అనుకున్నానని ఆయన వెల్లడించారు.