ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృతపాల్ సింగ్ పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు 'హిందూ రాష్ట్రం' అనే పదాలను తరచుగా పల్లవిస్తుండటంతో వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృతపాల్ సింగ్ ఖలిస్తాన్ గురించి మాట్లాడే ధైర్యం చేశారని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు.
Harassment : దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రేమ వ్యవహరాల కారణంగా హత్యలు, ఆత్మహత్యలు, హత్యలు వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్ ఆరోగ్య హక్కు బిల్లుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న ప్రైవేట్ వైద్యులు సోమవారం జైపూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎంఎస్ హాస్పిటల్‌లోని రెసిడెంట్ డాక్టర్స్ హాస్టల్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో వేలాది మంది వైద్యులు, వారి కుటుంబ సభ్యులు, మెడికల్ షాపు యజమానులతో పాటు వైద్యవృత్తితో సంబంధం ఉన్నవారు పాల్గొన్నారు.
ఈ రోజుల్లో ఆస్తికోసం సొంతవాళ్లనే చంపుకుంటున్నారు. జీవితంలో తమకు బంధాల కన్నా ఆస్తులే ముఖ్యమని భావిస్తున్న ఈ రోజుల్లో ఆ అన్నలు మాత్రం అలా ఆలోచించలేదు. ఆస్తులు కాదు తమకు చెల్లెలె ముఖ్యమని పెళ్లిని ఘనంగా జరిపించారు. కట్నం కింద రూ.8కోట్లు సమర్పించుకున్నారు. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
రాజస్థాన్ లోని ప్రైవేట్ ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్నంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సికార్ జిల్లాకు చెందిన ఓ మహిళ డాక్టర్ రోడ్డుపై పానీపూరి బండి పెట్టు్కుని పానీపూరి అమ్ముకుంటుంది.
Earthquake: ఇటీవల కాలంలో ఇండియాలోని పలు రాష్ట్రాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. రెండు రోజలు క్రితం చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో గంటల వ్యవధిలో 4 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆదివారం తెల్లవారుజామున రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదు. ఆదివారం తెల్లవారుజామున 2.16 నిమిషాలకు 4.2 తీవ్రతలో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం 516 కిలోమీటర్ల దూరంలో…
రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్ బీజేపీకి కొత్త చీఫ్‌గా సీపీ జోషి ఎన్నికయ్యారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
దేశంలో బీజేపీ బలోపేతం కొత్త వ్యూహాన్ని అమలు చేసింది. పలు రాష్ట్రాలకు కొత్త పార్టీ చీఫ్‌లను నియమించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ తన ఢిల్లీ, బీహార్, రాజస్థాన్ రాష్ట్ర యూనిట్లకు కొత్త చీఫ్‌లను గురువారం నియమించింది.
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లో జరిగిన ఒక ఫెయిర్‌లో డ్రాప్టవర్ రైడ్ కుప్పకూలింది. ఈ ఘటనలో 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎత్తైన ఊయల అకస్మాత్తుగా నేలపైకి పడిపోయింది.
డివిజనల్ హెడ్‌క్వార్టర్‌కు దూరంగా నివసించే ప్రజల అవసరాలను తీర్చడానికి 19 కొత్త జిల్లాలు, మరో మూడు డివిజనల్ హెడ్క్వార్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన ప్రకటన చేశారు.