రాజస్థాన్‌లో సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగ నిరసనకు దిగిన కాంగ్రెస్ యువనేత సచిన్ పైలట్ ఇవాళ హస్తినకు వెళ్తున్నారు. గత బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నిన్న సచిన్ పైలట్ నిరాహార దీక్ష చేశారు. పార్టీ అధిష్టానం వద్దని వారించినా.. ఆ దేశాలను ధిక్కరించిన తరువాత సచిన్ పైలట్ ఈ రోజు ఢిల్లీకి వెళుతున్నారు. ఢిల్లీలో పార్టీ నాయకత్వాన్ని కలవవచ్చని సమాచారం.
పైలట్ పార్టీ సీనియర్ నాయకులను కలుస్తారా? లేదా ? అన్నది ఉత్కంఠ కొనసాగుతోంది. అవినీతికి వ్యతిరేకంగా చర్య తీసుకోవాలంటూ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సచిన్ పైలట్ చేసిన నిరాహార దీక్షపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఉంది. పైలట్ దీక్ష పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించింది.
Also Read:YSR EBC Nestham: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్.. రేపే వారి ఖాతాల్లో రూ.15 వేలు జమ..
బిజెపికి చెందిన వసుంధర రాజేపై వచ్చిన ఆరోపణలపై చర్య తీసుకోలేదని ఆయన ఆరోపించిన ఆయన.. ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్‌ను లక్ష్యంగా చేసుకున్నారు సచిన్ పైలట్. షహీద్ స్మారక్ స్థల్ వద్ద జరిగిన ప్రజా నిరసనకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులెవరూ హాజరుకాలేదు. గత కొద్ది రోజులుగా గెహ్లాట్, పైలట్ మధ్య వార్ జరుగుతోంది. రాజస్థాన్‌లో తర్వలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు అగ్రనేతల మధ్య జరుగుతున్న బహిరంగ కుమ్ములాటలు కాంగ్రెస్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి.
Also Read:Kim Kardashian: కిమ్ కర్దాషియన్ విలక్షణమైన పాత్ర!
సచిన్ పైలట్ మంగళవారం రోజు నిరాహార దీక్ష పార్టీ ప్రయోజనాలకు విరుద్ధం, పార్టీ వ్యతిరేక చర్య అని కాంగ్రెస్ రాజస్థాన్ ఇన్‌ఛార్జ్ సుఖ్‌జీందర్ సింగ్ రంధవా అన్నారు. తన సొంత ప్రభుత్వంతో ఏదైనా సమస్య ఉంటే మీడియా, ప్రజల్లో కాకుండా పార్టీ వేదికలపై చర్చించవచ్చు అని సూచించారు.