రాజస్థాన్ లో ఓ వ్యక్తి రేజర్లు బ్లేడ్లు మింగి ఆస్పత్రి పాలైయ్యాడు. వైద్యుల శస్త్ర చికిత్సలో వ్యక్తి కడుపులో 56 రేజర్ బ్లేడ్లు బయటపడ్డాయి. రాజస్థాన్కు చెందిన యశ్పాల్ సింగ్ అనే 26 ఏళ్ల వ్యక్తి అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు.
రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తమ కుమారుడితో అప్పటివరకు హోలీ ఆడి ఆనందంగా గడిపిన దంపతులు.. స్నానం కోసం వెళ్లి బాత్రూంలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.
Student Suicide: రాజస్థాన్ కోటాలో మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ పరీక్షకు కోచింగ్ తీసుకుంటున్న 18 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలోనే ఉరేసుకుని మరణించింది. తక్కువ మార్కులు వస్తున్నాయన్న మనస్తాపంలోనే తమ కుమార్తె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
Head Master : విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన టీచర్లే దారి తప్పుతున్నారు. తమ దగ్గరికి విద్యను అభ్యసించడానికి వచ్చిన విద్యార్థులను లైగింకంగా వేధిస్తున్నారు.
56Blades in Stomach : రాజస్థాన్లోని జలోర్లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల ఓ యువకుడి కడుపులో రెండు కాదు ఏకంగా 56 షేవింగ్ బ్లేడ్లను తొలగించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇప్పుడు పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించే పనిలో ఆప్ అధినేత కేజ్రీవాల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
Kidnap: పెళ్లి కోసం మహారాష్ట్ర నుంచి నిరుపేద, మైనర్ బాలికలను అపహరించి పొరుగు రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్లలో అమ్ముతూ కొన్ని లక్షల వ్యాపారం చేస్తున్నారు.
Strange Baby : రాజస్థాన్లోని చురు జిల్లాలో ఓ వింత శిశువు జన్మించింది. రెండు గుండెలు, నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించిన ఆ శిశువు పుట్టిన 20నిమిషాల్లోనే మృతి చెందింది. రతన్గఢ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 19 ఏళ్ల గర్భిణి రెండు గుండెలు.. నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్న చిన్నారికి జన్మనిచ్చింది.
Stray Dog Kills Baby: రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. సిరోహి జిల్లాలో ప్రభుత్వాసుపత్రిలో తల్లి పక్కనే నిద్రిస్తున్న నెల రోజుల వయసున్న చిన్నారిని వీధికుక్క తీసుకెళ్లి చంపినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
NIA Raids In Popular Front Of India Case: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) టార్గెట్ గా రాజస్థాన్ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దాడులు నిర్వహిస్తోంది. రాజస్థాన్ లోని ఏడు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్ లో భాగంగా కోటాలో మూడు ప్రాంతాల్లో సవాయ్ మాధోపూర్, భిల్వారా, బుండి, జైపూర్ ప్రాంతాల్లో అనుమానితులు నివాస, వ్యాపార స్థలాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.