Male Goat Giving Milk : ఏంటి టైటిల్ చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యారా. అవునండి ఇది నిజం. అసలు ఇది ఎలా సాధ్యమైంది అని ఆశ్చర్య పడుతున్నారు కదా.. ప్రకృతికి విరుద్ధంగా ఎలా జరుగుతుంది అని అనుకుంటున్నారని అర్థమైంది.. మరి అసలు విషయం లోకి వెళ్దాం.. మేకపోతు పాలు ఇస్తున్న విచిత్రమైన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Read Also: Sonusood: సోనూ సూద్ పేరిట మోసం.. రూ.69వేలు స్వాహా
కరౌలిలోని సపోత్రా తాలూకా గోత్రా గ్రామంలో మేకలు పాలు ఇస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. పాలు ఇస్తున్న ఈ మేకను చూసేందుకు గ్రామస్తులు ఎగబడుతున్నారు. ఈ మేక 24 గంటల్లో 250 గ్రాముల పాలను ఇస్తుంది. అమీర్ ఖాన్ అనే పశువుల కాపరి వద్ద పదుల సంఖ్యంలో మేకలున్నాయి. ప్రతిరోజూ వాటిని అడవికి తీసుకెళ్లి.. మేపుకొస్తాడు. అమీర్ ఖాన్ పెంచుకుంటున్న మేకల్లో రెండేళ్ల వయసున్న ఓ మేకపోతు ఉంది. అతడు దానిని బాద్ షా అని ముద్దుగా పిలుచుకుంటాడు. ఐతే ఈ మేకపోతు.. మిగతా వాటితో పోల్చితే భిన్నమైనది. ఇది మగ జంతువు అయినప్పటికీ.. పురుషాంగం, వృషణాలతో పాటు రెండు పొదుగులను కూడా కలిగి ఉంది. అంతేకాదు.. ఆడ మేక లాగే పాలు ఇస్తోంది.
Read Also: Immoral Relationship : కొత్త ప్రేమకు మాజీ ప్రియుడు అడ్డంకి.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న ప్రియురాలు
15 ఏళ్లుగా మేకలను పెంచుతున్నప్పటికీ ఇలాంటి మేకపోతును ఎప్పుడూ చూడలేదని మేక యజమాని అమీర్ ఖాన్ చెబుతున్నాడు. తాను కరణ్‌పూర్‌లోని భైరోగావ్‌లో ఈ మేకపోతను రూ.51,000కు కొనుగోలు చేసినట్లు చెప్పాడు. దీని గురించి తెలిసి.. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త రూ. 1 లక్షకు కొనుగోలు చేశారని.. త్వరలోనే ఇది బంగ్లాదేశ్‌కు వెళ్లనుందని అమీర్ ఖాన్ తెలిపాడు. ఈ మేకపోతు ప్రతిరోజూ గేదె పాలు తాగుతుంది. పాలతో పాటు, ధోవ్ అకాసియా చెట్టు ఆకు, గోధుమ గింజలు, నానబెట్టిన పప్పును ఇష్టంగా లాగిస్తుందట. ఈ మేకపోతు గురించి తెలిసి.. చుట్టు పక్కల ప్రాంతాల వారు దానిని చూసేందుకు వస్తున్నారు.