Asaduddin Owaisi: హర్యానాలోని భివానీలో ఇద్దరు ముస్లిం యువకుల హత్యలు పొలిటికల్ దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ లక్ష్యంగా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. భజరంగ్ దళ్ వ్యక్తులే ఇద్దరు వ్యక్తులను హత్య చేశారని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. గో సంరక్షులను బీజేపీ కాపాడుతోందని.. హర్యానా ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్దారు. జునైడ్, నాసిర్ ల మరణాలు అమానవీయం అని ఓవైసీ అన్నారు. గో రక్షక్ అనే ముఠానే వీరద్దరిని చంపిందని.. వారికి…
Supreme Court : ఓ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న భార్యభర్తలు సుప్రీంకోర్టును వెరైటీ కోరిక కోరారు. బిడ్డను కనాలని ఉందని అందుకు ఐవీఎఫ్ చేయించుకునేందుకు పెరోల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆస్పత్రే వివాహానికి వేదికైంది. ఆస్పత్రిలోని ఓ గదినే మండపంగా అలంకరించారు. ఏంటీ పెళ్లి కోసం మండపాలు దొరకక అనుకుంటున్నారా..! కాదండోయ్.. ఆ ఆస్పత్రిలోనే పెళ్లి కుమార్తె చికిత్స పొందుతోందట.
Ashok Gehlot: రాజస్థాన్ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీవ్ర వివాదానికి కారణం అయింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాష్ట్ర బడ్జెట్ చదవడం ప్రారంభించిన తర్వాత ఇది గతేడాది బడ్జెట్ ప్రసంగం అని ప్రతిపక్ష బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సీఎం పాత బడ్జెట్ ను చదువుతున్నారని ఆరోపించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో సీఎం అశోక్ గెహ్లాట్ కొన్ని నిమిషాల పాటు పాత బడ్జెట్ ను చదివారు. ఎట్టకేలకు కాంగ్రెస్ మంత్రి మహేష్…
Rajasthan: రాజస్థాన్ దౌసాలో భారీగా పేలుడు పదార్ధాలు పట్టుబడ్డాయి. పోలీసులు గురువారం 1,000 కిలోల పేలుడు పదార్థాలతో దౌసాకు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని రాజేష్ మీనాగా గుర్తించారు. అయితే ఈ పేలుడు పదార్థాలు మొత్తం అక్రమ మైనింగ్ కు సంబంధించినవిగా పోలీస్ అధికారులు నిర్థారించారు. నిందితుడి వద్ద నుంచి 65 డిటోనేటర్లు, 13 వైర్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు సమాచారం రావడంతో వాహనాలను తనిఖీ చేస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు లభించాయి.…
Camel tied to tree, beaten to death for killing owner in Bikaner: రాజస్థాన్ బికనీర్ లో దారుణంగా ఓ ఒంటెను చంపేశారు. జంతువు చేసిన తప్పుకు మానవులే జంతువులుగా మారుతున్నారు. గ్రామస్తులంతా కలిసి ఒంటెను చనిపోయే దాకా చితకబాదారు. ఇంతకీ ఒంటె నేరం ఏమిటంటే.. ఒంటె తన యజమానిని చంపడమే. దీంతో కుటుంబ సభ్యులు, ఆ గ్రామస్తులు అంతా కలిసి ఒంటెను దారుణంగా చంపేశారు.
Rajasthan Man Thrashed, Forced To Drink Urine: రాజస్థాన్ లో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మాయిని రహస్యంగా కలిసేందుకు వచ్చిన యువకుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టి, చెట్టుకు కట్టేసి బలవంతంగా మూత్రం తాగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్ జలోర్ జిల్లాలో ఈ అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రావడంతో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. బాధిత యువకుడిపై పోక్సో చట్టం కింద…
Ramdev Charged For Hate Speech: ముస్లింలపై విద్వేషవ్యాఖ్యలు చేసిన ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ పై కేసు నమోదు అయింది. రాజస్థాన్లోని బార్మర్లో జరిగిన కార్యక్రమంలో రామ్దేవ్ బాబా ముస్లింలపై ద్వేషపూరిత ప్రసంగానికి పాల్పడ్డారు. దీనిపై స్థానికంగా ఉండే పథాయ్ ఖాన్ చౌహతాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.
Baba Ramdev: ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ముస్లింలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ముస్లిలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, హిందూ యువతను అపహరిస్తున్నారని ఆరోపించారు. ఇస్లాం, క్రైస్తవ మతాలు ప్రజలను మతం మార్పిడి చేయడం వంటి ఏకైక అజెండాతో పనిచేస్తున్నాయని అన్నారు. రాజస్థాన్లోని బార్మర్లో గురువారం జరిగిన మతపరమైన సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. నేను ఎవరిని విమర్శించడం లేదని.. ప్రపంచాన్ని ఇస్లాం, క్రైస్తవ…