లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాకుల మీద షాక్‌లు తగులుతున్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ చబ్బేవాల్ తక్షణమే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అనంతరం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.
అకాలీదళ్ 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఆ లోక్‌సభ ఎన్నికల్లో అకాలీదళ్- బీజేపీలు రెండేసి స్థానాల్లో విజయం సాధించాయి. అయితే, ఈ సారి లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ- అకాలీదళ్ కూటమి సీట్లపై ప్రకటన ఉండనుంది అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
పంజాబ్ నుంచి లోక్‌సభ ఎన్నికలకు 8 మంది అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ తన మొదటి జాబితాను గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో ఐదుగురు కేబినెట్ మంత్రులు ఉన్నారు.
Farmers Protest : సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా అన్ని పంటలకు కనీస మద్దతు ధర (MSP) కోసం చట్టపరమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Farmers Protest : ఢిల్లీకి రైతుల పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. రైతు నేతలు ఇప్పుడు మార్చి 3న అంటే ఆదివారం రోజున ప్లాన్ చేసి కొత్త వ్యూహాన్ని ప్రకటిస్తారు.
పాకిస్థాన్ దేశానికి భారతదేశం మరో షాక్ ఇచ్చింది. రావి నది జలాలను పూర్తిగా నిలిపి వేసినట్లు సమాచారం. అయితే, దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న షాపుర్ కండీ ఆనకట్ట నిర్మాణం పూర్తి కావడమే దీనికి ప్రధాన కారణం.
Ravi River: సింధు దాని ఉపనదుల జలాలను భారత్ సమర్థవంతంగా వాడుకునేందుకు సిద్ధమైంది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో నిర్మితమవుతున్న షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం తుదిదశకు చేరుకోవడంతో పాకిస్తాన్కి రావి నది నీటి ప్రవాహాన్ని భారత్ నిలిపేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లోకి ప్రవహించే 1150 క్యూసెక్కుల రావి నది నీటిని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లోని కథువా, సాంబా జిల్లాల్లోని 32,000 హెక్టార్ల భూమికి సాగు నీరుగా ఇవ్వనున్నారు.
Amritpal Singh: ఖలిస్తానీ నేత, వివాదాస్పద వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్పాల్ సింగ్, అతని అనుచరులు అస్సాంలోని అత్యంత భద్రత కలిగిన జైలులో ఉన్నారు. అస్సాంలోని దిబ్రూగఢ్ సెంట్రల్ జైలో భారీ భద్రత కలిగిన జైలులో భద్రత ఉల్లంఘన వెలుగులోకి వచ్చింది. వేర్పాటువాద నేత, అతని 9 మంది సహచరులు ఉన్న సెల్ నుంచి స్పై కెమెరాలు, స్మార్ట్ ఫోన్, కీప్యాడ్ ఫోన్, పెన్ డ్రైవ్స్, బ్లూటూత్ హెడ్ ఫోన్స్, స్పీకర్లు, స్మార్ట్ వాచ్…
తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ అన్నదాతలు (Farmers Protest) చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం మరింత ఉధృతంగా మారుతోంది. ఇప్పటికే దేశ రాజధాని పరిసరాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.