Punjab: కాల్పులతో మారుమోగుతున్న పంజాబ్..11 రోజుల్లో 8 ఎన్‌కౌంటర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab: పంజాబ్ రాష్ట్రం పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య కాల్పులతో దద్దరిల్లిపోతోంది. ఆదివారం రాష్ట్రంలో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుంది. ఈ రోజు తెల్లవారుజామున మోగా జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. లక్కీ పాటియాల్ గ్యాంగ్‌లో ముగ్గురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బైకుపై వచ్చిన గ్యాంగ్‌స్టర్లని పోలీసులు గమనించి, ఆపాలని కోరినప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేశారు. బైక్‌ని వదిలి పొలాల్లోకి పరిగెత్తారని, పోలీసులపై కాల్పులు జరిపారని మోగా డీఎస్పీ హరీందర్ సింగ్ తెలిపారు.
Also Read
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
పోలీసులు ప్రతిదాడి చేయడంతో వారు లొంగిపోయారని, ఈ ఘటనలో ఒకరు తప్పించుకునే ప్రయత్నంలో గాయపడ్డారని, పోలీసుల కాల్పుల్లో కాదని అధికారులు తెలిపారు. అరెస్టయిన గ్యాంగ్‌స్టర్ల నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
పంజాబ్ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా గ్యాంగ్‌స్టర్ల కట్టడి జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు, ముఠాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. గత 11 రోజుల్లో తాజాగా జరిగింది 8వ ఎన్‌కౌంటర్. ఇటీవల తమపై దాడులు చేసేందుకు వస్తే పోలీసులు ప్రతీకారం తీర్చుకుంటారని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బహిరంగ హెచ్చరిక జరిగిన తర్వాత ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. మొహాలి, పాటియాలో నిన్న రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. దీంట్లో ఇద్దరు కారు దొంగల్ని, హత్య నిందితులను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్‌కు ఆసియా కప్ ట్రోఫీలు!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!