CM Bhagwant Mann: “మేము సైలెంట్‌గా ఉన్నాం కాబట్టే సీఎం అయ్యాడు”.. పంజాబ్ సీఎం కూతురు సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై ఆయన కుమర్తె సీరత్ మాన్ చేసిన విమర్శలు, ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాను సీఎం భగవంత్ మాన్ కుమార్తెనని, అయితే ఆయనను నాన్న అని పిలిచే హక్కుని చాలా కాలంగా కోల్పోయాడని అన్నారు. ‘‘నేను ఈ వీడియో చేయడం వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. నా కథ బయటకు రావాలని కోరుకుంటున్నాను. ప్రజలు మా గురించి ఏది విన్నారో, అది సీఎం మాన్ స్వయంగా చెప్పినవే’’ అని ఆమె అన్నారు.
ఇప్పటి వరకు తాను మౌనంగా ఉన్నానని, తన తల్లి కూడా మౌనంగా ఉందని, మా మౌనమే తమ బలహీనగా భావిస్తున్నట్లు చెప్పింది. మా మౌనం కారణంగానే అతను ప్రస్తుతం సీఎం కుర్చున్నాడనే విషయం అతనికి తెలియదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం మాన్ రెండో భార్య గురుకీరత్ గర్భవతి అని, సీఎం మూడోసారి తండ్రి కాబోతున్నాడని సీరత్ వీడియోలో చెప్పింది. ఈ విషయం కూడా తమకు ఇతరుల ద్వారా తెలిసిందని సీరత్ చెప్పారు.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
Read Also: Rashmika: ‘యానిమల్’లో రచ్చ లేపావ్.. రష్మికపై అమితాబ్ ప్రశంసలు
నీకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు, వారిని నిర్లక్ష్యం చేసి ఇప్పుడు మూడో వాడికి జన్మనివ్వాలని అనుకుంటున్నావని సీఎంని ప్రశ్నించింది. గతంలో సీఎం మాన్‌ని కలిసేందుకు తన సోదరుడు దోషన్ రెండుసార్లు పంజాబ్ వెళ్లారని, దోషన్ సీఎం ఇంటికి రానివ్వలేదని, ఆ తర్వాత అతను చంఢీగఢ్‌లో స్నేహితులతో కలిసి ఉన్నాడని సీరత్ చెప్పింది. అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టారని, సొంత పిల్లల బాధ్యత తీసుకోలేని వ్యక్తి ప్రజల బాధ్యత ఎలా తీసుకుంటారని ఆమె ప్రశ్నించింది.
మేము చూసిన బాధలు పంజాబ్ ప్రజలకు కూడా జరుగుతోందని, తన తల్లి రాజకీయాల్లోకి రావద్దని సీఎం మాన్ విడాకులకు కారణాలు చెబుతన్నాడని, కానీ విడాకులకు చాలా కారణాలు ఉన్నాయని, తన తల్లి ఆమె కథను చెప్పేందుకు సిద్ధంగా ఉందని సీరత్ చెప్పారు. భగవంత్ మాన్ మద్యం సేవించడం, మానసిక, శారీరక వేధింపులకు గురిచేశడని సంచలన ఆరోపణలు చేశారు. అతను అసెంబ్లీకి, గురుద్వారాలకు కూడా మత్తులోనే వెళ్తాడని ఆరోపించారు.
. @BhagwantMann की बेटी ने जो आरोप भगवंत मान पर लगाये है बेहद गंभीर हैं । चाहे वो भगवंत मान द्वारा अपने बेटे को CM हाउस में घुसने से रोकना हो या गुरुद्वारे और विधानसभा में शराब पीकर जाना हो चाहे वो शराब पीकर अपनी पत्नी के साथ घटिया हरकते करना हो । @ArvindKejriwal क्या इन आरोपों… pic.twitter.com/k9QbYZUKK1
— Tajinder Bagga (@TajinderBagga) December 9, 2023
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!