ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. బటిండాలో పంజాబ్ ప్రభుత్వం రూ.1125 కోట్ల విలువైన పథకాల శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని మొత్తం 13 సీట్లను ఆప్ కు ఇవ్వాలని అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పనిని చూసి పంజాబ్‌లో తమకు ఓటేశారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వచ్చేసారి 117 సీట్లలో 110కి పైగా ఆమ్ ఆది పార్టీకి సీట్లు వస్తాయని తన మనసు చెబుతోందని కేజ్రీవాల్ అన్నారు. అనంతరం.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Read Also: TS Congress: రేపు పీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం
భగవంత్ మాన్ ప్రభుత్వ పనిని చూసి ఇక్కడి ప్రతిపక్షాలన్నీ భయపడుతున్నాయని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అందరూ కలిసి కేంద్రం వద్దకు వెళ్లి ఇన్ని పనులు చేస్తున్నారు, ఆపాలని అన్నారని కేజ్రీవాల్ తెలిపారు. దీంతో కేంద్రం నీచమైన పని చేసింది.. పంజాబ్‌లోని ఆరోగ్యం, రోడ్ల కోసం డబ్బును నిలిపివేసిందని దుయ్యబట్టారు. నాందేడ్ సాహిబ్, హుజూర్ సాహిబ్, పాట్నా సాహిబ్ (ముఖ్యమంత్రి తీర్థయాత్ర పథకం కింద) వెళ్లే రైళ్లను తిరస్కరించారు.
Read Also: Hyderabad: పాతబస్తీలో కెమికల్ బ్లాస్ట్.. ఓ వృద్దుడికి తీవ్ర గాయాలు.
కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ప్రజలను అసంతృప్తికి గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కూడా చాలా పనులు ఆపేయాలని ప్రయత్నించినా ఒక్క పని కూడా ఆగనివ్వలేదన్నారు. అదేవిధంగా.. పంజాబ్‌లోని ఒక్క పని కూడా ఆగిపోనివ్వనని.. మూడు కోట్ల మందితో రంగ్లా పంజాబ్‌ను సృష్టిస్తామన్నారు. ప్రభుత్వం నష్టాల్లో నడుస్తోందని కెప్టెన్ సాహెబ్, బాదల్ సాహెబ్ చెబుతుంటారని ఢిల్లీ సీఎం అన్నారు. మన ప్రభుత్వం ఏర్పడితే అక్కడ వారి లెక్కలు చూడండి.. అంత అవినీతి జరిగిందని విమర్శించారు. రూ.10కి చేసే పనిని రూ.100కి చేస్తున్నారని దుయ్యబట్టారు.