ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ రైల్వేస్టేషన్‌లో ఓ పాము హల్‌చల్ సృష్టించింది. 6 అడుగుల పొడవైన పాము కలకలం సృష్టించింది. దీంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. భయంతో వణికిపోయారు. కొందరు పరుగులు తీశారు.
బీహార్‌లో మరో రైలుకు ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగాయి. దీంతో.. ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటన కిషన్‌గంజ్ రైల్వే స్టేషన్ కు 200 నుంచి 250 మీటర్ల దూరంలో ఉన్న ఫరింగోరా సమీపంలో జరిగింది. కిషన్‌గంజ్ నుండి సిలిగురికి వెళ్లే DMU ప్యాసింజర్ రైలు ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌లో మంటలు వచ్చాయి.
తమిళనాడులో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. చెయ్యార్ పట్టణం సమీపంలో చెన్నైకి వెళ్తున్న వ్యాన్, బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అక్కడున్న సీసీటీవీలో రికార్డు అయింది. కాగా.. ఈ ప్రమాదం జరగ్గానే ఇద్దరు ప్రయాణికులు కొద్దిసేపు గాల్లోనే ఉండి కిందపడ్డారు.
సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన SV792 విమానం పాకిస్థాన్‌లోని పెషావర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా మంటలు చెలరేగాయి. ల్యాండింగ్ గేర్‌లో సమస్య కారణంగా టైర్‌కు మంటలు వచ్చాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. మీడియా నివేదికల ప్రకారం.. మొత్తం 276 మంది ప్రయాణికులు, 21 మంది సిబ్బంది విమానంలో ఉన్నారు.
ఓ ట్రైన్ పట్టాలపై పరుగులు పెడుతోంది. రైలు ఆగదిలే.. ఏం చేసినా ఫర్వాలేదు అనుకున్నారు కొందరు ఆకతాయిలు. ఇంకేముంది.. రైల్వే ట్రాక్ ఆనుకుని ఒక చెరువు ఉంది. అందులో బైక్ స్టాండ్ చేసి స్టార్ట్ చేశారు. చక్రం స్పీడ్‌గా తిరుగుతూ..
రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంటు కోతతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చెక్-ఇన్ సహా అనేక సౌకర్యాలు నిలిచిపోయాయి. అయితే కొద్దిసేపటి తర్వాత కరెంటు రావడంతో పరిస్థితి సాధారణమైంది. విద్యుత్ కోత కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 3లో తాము చాలా అసౌకర్యానికి గురయ్యామని ప్రయాణికులు తెలిపారు. డిజి యాత్ర, చెక్‌ఇన్ కౌంటర్లు ఆగిపోయాయి. ఈ క్రమంలో.. ఒక వినియోగదారు ట్విట్టర్‌లో ఇలా వ్రాశారు, 'విద్యుత్ వైఫల్యం కారణంగా,…
ఇటీవల కాలంలో విమానాల్లో, విమనాశ్రయాల్లో ఆకతాయిలు బాంబులు పెట్టామని బెదిరింపు కాల్స్ వస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరిస్తున్నారు. మరోవైపు.. ఇప్పటికి వచ్చిన బెదిరింపు కాల్స్ అన్నీ ఫేక్ అని అధికారులు నిర్థారించారు. ఇదిలా ఉంటే.. తాజాగా మరో విమానానికి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో.. చెన్నై నుండి ముంబైకి వెళ్తున్న ఇండిగో 6E 5314 విమానం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
దేశ రాజధాని ఢిల్లీలో విమాన ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. ఓ వైపు హస్తినలో తీవ్రమైన ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అలాంటిది విమాన ప్రయాణం ఆలస్యం కావడం.. 8 గంటల తర్వాత ఎయిర్ కండిషన్ లేని విమానంలో కూర్చోబెట్టడంతో ప్యాసింజర్స్ ఉక్కపోత, వేడితో అల్లాడిపోయారు. చిన్నారులు, వృద్ధులు బెంబేలెత్తిపోయారు. దీంతో ఎయిరిండియా తీరుపై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఎక్స్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేసి.. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకి…
ఎయిర్ పోర్టు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం శనివారం గన్నవరం నుంచి బెంగళూరుకు వెళ్లింది.