తమిళనాడులో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. చెయ్యార్ పట్టణం సమీపంలో చెన్నైకి వెళ్తున్న వ్యాన్, ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అక్కడున్న సీసీటీవీలో రికార్డు అయింది. కాగా.. ఈ ప్రమాదం జరగ్గానే ఇద్దరు ప్రయాణికులు కొద్దిసేపు గాల్లోనే ఉండి కిందపడ్డారు. అనంతరం గాయపడిన క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Read Also: PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి పాకిస్తాన్ ఆహ్వానం..!
ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ మృతి చెందాడు. మరోవైపు.. తీవ్రంగా గాయపడిన ఐదుగురు ప్రయాణికులను కాంచీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై బ్రహ్మదేశం పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. అందులో బస్సు చెయ్యార్‌కు వెళుతుండగా.. ట్రాక్టర్‌ను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనబడింది. అది చూసిన వ్యాన్ డ్రైవర్ ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి బస్సును ఢీకొట్టాడు.
Read Also: Pakistan: పాక్‌లో ఘోరం.. బస్సు కాలువలో పడి 29 మంది మృతి..