Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?
- మరోసారి వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో యశ్ దయాల్
- వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి
- ఎవరీ యశ్ దయాల్ సతీమణి శ్వేత పుండిర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Who Is Yash Dayal’s Wife Shweta Pundir: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ యశ్ దయాల్ మరోసారి తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచాడు. వ్యక్తిగత జీవితంలోని వివాదాల మధ్య ఇటీవల అతడు సీక్రెట్‌గా వివాహం చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఫిబ్రవరి 4న నోయిడాలో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో శ్వేత పుండిర్‌ను యశ్ దయాల్ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు టీమిండియా, ఆర్సీబీ ప్లేయర్స్ ఎవరూ హాజరుకాకపోవడం గమనార్హం.
గత ఏడాది కాలంగా యశ్ దయాల్‌పై రెండు లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. యశ్ మాజీ ప్రేయసి ఓ కేసు నమోదు చేయగా, మరో కేసు ఒక మైనర్‌కు సంబంధించిన ఆరోపణలపై పోక్సో కింద నమోదైంది. ఈ కేసులో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. అయితే తర్వాత రాజస్థాన్ హైకోర్టు ఆ వారెంట్‌పై స్టే ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసులు విచారణలో ఉండగా.. యశ్ బెయిల్‌పై బయట ఉన్నాడు. వివాదాలు, న్యాయపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నప్పటికీ.. అతడు వివాహం చేసుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో అతడిని పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరా? అని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
- Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
- Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
- Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
శ్వేత పుండిర్ ఉత్తరాఖండ్‌కు చెందిన అమ్మాయి. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో నివసిస్తున్నారు. శ్వేత కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మాత్రమే కాదు.. బ్రాడ్‌కాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సుమారు 5.87 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా.. యూట్యూబ్‌లో 50 వేలకుపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అంతేకాకుండా ఇంటర్ కాంటినెంటల్ లెజెండ్స్ లీగ్‌లో బ్రాడ్‌కాస్టర్‌గా కూడా పని చేసిన అనుభవం ఆమెకు ఉంది. అయితే వీరిద్దరికి ఎపుడు, ఎలా పరిచయం అయిందనే విషయాలు ఇంకా తెలియరాలేదు.
ఇక యశ్ దయాల్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో భాగంగా ఉన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో అతను ఆడే అవకాశముందని సమాచారం. వివాదాల మధ్య కూడా అతని క్రికెట్ కెరీర్ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి. ఐపీఎల్ 2025 టైటిల్ ఆర్సీబీ గెలవడంలో యశ్ దయాల్ కీలక పాత్ర పోషించారు. యశ్ దయాల్ 43 ఐపీఎల్ మ్యాచ్‌లలో 41 వికెట్స్ పడగొట్టాడు. అతడి బెస్ట్ బౌలింగ్ గణాంకాలు 3/20. ఐపీఎల్ 2025లో బెంగళూరు తరఫున 13 వికెట్స్ పడగొట్టాడు.
తాజావార్తలు
-
Soori: కమెడియన్ నుంచి హీరోగా.. ఒక్క సినిమాకు రూ.25 కోట్లు?.. సూరి రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్‌ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!