బాబోయ్.. ఇండిగో విమాన ప్రయాణికుల కష్టాలు అన్నీఇన్నీ కావు. రెండు, మూడు రోజులుగా విమాన సర్వీసులు లేక ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఇటు ఇంటికి వెళ్లలేక.. అటు ప్రయాణం లేక విమానాశ్రయాల్లోనే పడిగాపులు పడుతున్నారు.
ఇండిగో విమాన సంస్థ ఇచ్చిన షాక్‌తో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో నరకయాతన పడుతున్నారు. అటు ప్రయాణాలు లేక.. ఇటు ఇంటికి వెళ్లలేక.. తిండి తిప్పలు లేక విమానాశ్రయాల్లోనే పడిగాపులు పడుతున్నారు.
దేశంలో అత్యంత ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. ఈ పండుగ కోసం ఎక్కడున్నా సొంతూళ్లకు వెళ్లిపోతుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రాండ్‌గా వేడుకలు జరుపుకుంటారు. ఇక బీహార్‌లో అయితే ఎన్నికల పండుగ కూడా జరుగుతోంది.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో రైల్ సంస్థ మెట్రో సేవలను పొడిగించింది. ఆగస్ట్ 30న ప్రత్యేకంగా పొడిగించిన సేవలు అందిస్తోంది. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి 11:45 గంటలకు బయలుదేరుతుంది. మీ పండల్ దర్శనాలు ఇప్పుడు మరింత సులభం, టెన్షన్ లేకుండా..ఎక్కువ సమయం.. ఎక్కువ భక్తి.. ఎక్కువ సౌకర్యం.. అంటూ హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. నగరంలో గణపతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గణేషుడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తకుండా…
రాయపర్తి మండలం మైలారం గ్రామ శివారు ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారి (563)పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. వరంగల్ నుంచి తొర్రూరు వైపుకు వెళ్తున్న బస్సుని వరంగల్ వైపు వస్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25మందికీ ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్ లో సుమారు 44 మంది ప్రయాణికులు వున్నట్టు ప్రాథమిక సమాచారం. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని…
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం తెల్లవారుజామున సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభం అయ్యాయి.. భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా భద్రతా సంసిద్ధత పెరిగిన నేపథ్యంలో ప్రయాణికులకు ఒక సలహా జారీ చేశారు.. ఢిల్లీ విమానాశ్రయ కార్యకలాపాలు ప్రస్తుతం సాధారణంగా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారింది. పట్టపగలే మేఘావృతం అయింది. అంతేకాకుండా గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అప్రమత్తం అయింది. ఈ మేరకు ప్రయాణికులను హెచ్చరించారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. బెంగళూరు వెళ్లవలసిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ఇంకా రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లవలసిన 150 మంది ప్రయాణికులు ఫ్లైట్ ఆలస్యం కావడంతో అధికారులపై మండిపడ్డారు. ప్రయాణికులకు అధికారులకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. శ్రీనగర్ నుంచి ఫ్లైట్ రాకముందే బోర్డింగ్ ఎందుకు ఇచ్చారని గొడవపడ్డారు. ఫ్లైట్ ఆలస్యానికి సంబంధించిన సమాచారం ఇవ్వకుండా గంటల తరబడి వెయిట్ చేయించడం ఎందుకని అధికారులను…
ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో భారీగా ప్రాణ నష్టం జరుగుతోంది. తాజాగా మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ మెక్సికోలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 41 మంది మరణించారు. 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టిందని మెక్సికోలోని టబాస్కో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగడంతో ఈఘోరం చోటుచేసుకుందని…