రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంటు కోతతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చెక్-ఇన్ సహా అనేక సౌకర్యాలు నిలిచిపోయాయి. అయితే కొద్దిసేపటి తర్వాత కరెంటు రావడంతో పరిస్థితి సాధారణమైంది. విద్యుత్ కోత కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 3లో తాము చాలా అసౌకర్యానికి గురయ్యామని ప్రయాణికులు తెలిపారు. డిజి యాత్ర, చెక్‌ఇన్ కౌంటర్లు ఆగిపోయాయి. ఈ క్రమంలో.. ఒక వినియోగదారు ట్విట్టర్‌లో ఇలా వ్రాశారు, ‘విద్యుత్ వైఫల్యం కారణంగా, ఢిల్లీ విమానాశ్రయం T3 పూర్తిగా చీకటిగా మారింది. కౌంటర్ లేదు, డీజీ లేదు, ఏదీ పని చేయడం లేదు”. అని తెలిపారు.
Salman Khan: సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు.. రాజస్థాన్ యూట్యూబర్ అరెస్ట్..
పవర్ కట్ పై ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ స్పందిస్తూ.. తాము ఫీడ్‌బ్యాక్‌ను గుర్తించామని, సంబంధిత బృందంతో సంప్రదింపులు జరిపామని చెప్పారు. కేవలం 2-3 నిమిషాలు మాత్రమే కరెంటు లేదని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. అనంతరం.. బ్యాగేజీ లోడింగ్, డీజీ ప్రయాణం, ఏసీ పని చేయడం ప్రారంభించాయని పేర్కొన్నారు. కాగా.. విద్యుత్తు అంతరాయం విమాన కార్యకలాపాలపై ప్రభావం చూపలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. “ఎక్కువ AC లోడ్ కారణంగా పూర్తి శక్తికి తిరిగి రావడానికి కొన్ని నిమిషాలు పట్టింది” అని పేర్రొన్నారు. డిజి యాత్ర సిస్టమ్ రీబూట్ చేయబడి.. వెంటనే పని చేయడం ప్రారంభించిందని చెప్పారు.
Delhi Metro : మరోసారి ఢిల్లీ మెట్రో వైరల్.. ఈ సారి ఏంటంటే..!
ఇటీవల ఢిల్లీలోని పలు ప్రాంతాలు విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ పవర్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం కారణంగా ఈ సమస్య తలెత్తిందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీ విద్యుత్‌తో పాటు, నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే..