విస్తారా విమాన సంస్థ కీలకం నిర్ణయం తీసుకుంది. ఫైలట్లు, సిబ్బంది కొరత సహా ఇతర కారణాల కారణంగా విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్లు విస్తారా ఎయిర్ లైన్స్ ప్రకటించింది.
ఢిల్లీ మెట్రో (Delhi Metro) సరికొత్త రికార్డు సృష్టించింది. మెట్రో చరిత్రలోనే ఇదొక సరికొత్త అధ్యాయం. మంగళవారం మెట్రో స్టేషనలన్నీ జాతరను తలపించాయి. ఇసుకేస్తే రాలనంత జనం.
సంక్రాంతి పండగ కోసం హైదరాబాద్ నగరం నుంచి భారీగా తరలి తమ సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. అయితే, సొంతూర్లకు వెళ్లే పనిలో ప్రయాణికులు ఉంటే.. దొంగలు మాత్రం తమ చేతివాటానికి పని చెప్తున్నారు. జూబ్లీ బస్టాండ్ పరిధిలో ఈ మూడు రోజుల్లో అనేక సెల్ ఫోన్స్ చోరీకి గురయ్యాయి.
పండగ సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. టికెట్ రేట్లను వారికి ఇష్టం వచ్చినంత పెంచి వసూలు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా.. ప్రైవేట్ టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి. ఓ వైపు సంక్రాంతి.. మరోవైపు శనివారం, ఆదివారం కలిసి రావడంతో ఖర్చును సైతం లెక్క చేయకుండా సొంత ఊర్లకు వెళ్లడానికి జనాలు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్.. ప్రయాణికుల నుంచి అధికంగా డబ్బులు రాబడుతున్నారు.
Ponnam Prabhakar: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది.
ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు,…
Kagaznagar Train: సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ రైలులో తృటిలో ప్రమాదం తప్పింది. బీబీ నగర్ సమీపంలో రైలు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు.