Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ఏరియాల్లో రోడ్లపై వరద నీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం సాయంత్రం భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇప్పటికే వాతావరణ శాఖ (IMD) రాబోయే ఆరు రోజుల పాటు (మార్చి 16 నుండి 21 వరకు) తెలంగాణలో ఉరుములు, మెరుపులు. బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన నేపథ్యంలో.. అంచనాలకు తగ్గట్టుగానే నగరం అకాల వర్షంతో తడిసి ముద్దయ్యింది. అకస్మాత్తుగా కురిసిన ఈ వానతో సాయంత్రం వేళ కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ కారిడార్లతో పాటు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ మరియు పాతబస్తీ ప్రాంతాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు నిలవడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు నానా అవస్థలు పడ్డారు.
రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించిపోయింది. ముఖ్యంగా పంజాగుట్ట, హైటెక్ సిటీ ఫ్లైఓవర్లు, మెయిన్ జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలు మందగించాయి. వాహనదారులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని గమనించిన జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. వరద నీటిని తొలగించేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందాలను రంగంలోకి దించారు. నాలాల వద్ద, మ్యాన్‌హోల్స్ దగ్గర పేరుకుపోయిన చెత్తను తొలగించి.. నీరు త్వరగా వెళ్లేలా సిబ్బంది చర్యలు చేపట్టారు.
లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రాబోయే కొద్ది రోజులు కూడా ఇదే విధమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్నందున, ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా.. వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!