AP East-West Cargo Corridor: ఈస్ట్-వెస్ట్ కార్గో కారిడార్‌గా ఏపీ.. నూతన పోర్టుల్లో త్వరలోనే ఆపరేషన్లు ..
- ఈస్ట్-వెస్ట్ కార్గో కారిడార్‌గా ఏపీ..
- నూతన పోర్టుల్లో త్వరితగతిన ఆపరేషన్లు ..
- రెండో దశ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వేగవంతం..
- పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై సమీక్షలో సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP East-West Cargo Corridor: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పోర్టుల నుంచి కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్ల ద్వారా ఈస్ట్ -వెస్ట్ కార్గో కారిడార్‌గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మితం అవుతున్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల్లో త్వరితగతిన కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్లు ప్రారంభం కావాలని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మూడు పోర్టుల నుంచి పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్‌ఘఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకల హింటర్ ల్యాండ్ నుంచి కార్గో రవాణా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు 2026 డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీ కూడా ఏర్పాటైన అనంతరం కంటైనర్, బల్క్ కార్గో పోర్టుగా రామాయపట్నం మారుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Read Also: India-Iran: ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం తాజా హెచ్చరికలు ఇవే!
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
రామాయపట్నం నుంచి కడప స్టీల్ ప్లాంట్ వరకూ ప్రత్యేక మార్గాన్ని వేసేందుకు కూడా రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని సీఎం చంద్రబాబు తెలిపారు. మూడు పోర్టులకు సమీపంలోనూ పోర్టు టౌన్ షిప్ ఏర్పాటు చేయడం ద్వారా వాణిజ్య పరమైన లావాదేవీలు కూడా పెరుగుతాయని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వీటితో పాటు పోర్టులకు సమీపంలో పారిశ్రామిక కారిడార్‌లు కూడా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉందన్నారు. రెండో దశలో బుడిగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్లను కూడా వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. సమీప భవిష్యత్తులో ప్రతీ 50 కిలో మీటర్లకు పోర్టు, ఫిషింగ్ హార్బర్లు రానున్న నేపథ్యంలో ఈస్ట్ కోస్టు లాజిస్టిక్స్ హబ్ గా ఏపీ మారుతుందన్నారు. ఏపీలో ఉన్న పోర్టులు కార్గో హ్యాండ్లింగ్‌లో గేమ్ ఛేంజర్‌గా మారాలని సీఎం సూచనలు చేశారు. ప్రస్తుతం యుద్ధం కారణంగా దుబాయ్, గల్ఫ్ దేశాల్లోని ఓడరేవులు ఇబ్బందుల్లో పడ్డాయని.. ఇప్పుడు భారత్ లోని ఈస్ట్ కోస్ట్ లో ఉన్న పోర్టులే సురక్షితం అన్న అభిప్రాయం వచ్చిందని ఈ ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, మారి టైమ్ బోర్డు సీఈఓ అభిషేక్ కుమార్ హాజరయ్యారు.
తాజావార్తలు
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!