ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ రైల్వేస్టేషన్‌లో ఓ పాము హల్‌చల్ సృష్టించింది. 6 అడుగుల పొడవైన పాము కలకలం సృష్టించింది. దీంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. భయంతో వణికిపోయారు. కొందరు పరుగులు తీశారు. రైళ్ల కోసం ప్రయాణికులు వేచి ఉన్నారు. ఇంతలో అకస్మాత్తుగా రైల్వే ట్రాక్‌లపై పాము కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇంతలో అది ఫ్లాట్‌ఫామ్ పైకి వచ్చేసింది. రిషికేశ్‌లోని యోగనగరి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి: MP Horror: 7 నెలల గర్భిణి అని చూడకుండా.. కట్నం కోసం నిప్పంటించి చంపారు..
చాలా మంది ప్రయాణికులు రక్షణ కోసం పరిగెత్తడం కనిపించింది. కొందరు ఇతరులను హెచ్చరించడానికి ప్రయత్నించారు. నిమిషాల వ్యవధిలోనే ప్లాట్‌ఫారమ్ అంతా గందరగోళంగా మారింది. భద్రత కోసం హడావిడిలో భయాందోళనకు గురైన ప్రయాణికులు తమ సామాను, వస్తువులను విడిచిపెట్టి పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Uttarakhand: Snake Found On Rishikesh Station Platform, Causing Panic Among Commuters, Video Goes Viral#Rishikesh #Uttarakhand #viralvideo #viralnews pic.twitter.com/wjtojFEmlf
— Republic (@republic) September 20, 2024