Shahid Afridi: పాక్ క్రికెట్‌లో సంక్షోభం.. అల్లుడిని టార్గెట్ చేసిన షాహీద్ అఫ్రిది..
- బంగ్లాదేశ్ చేతిలో పాక్ ఘోర పరాజయం.. పాక్ సెలక్టర్లు, అల్లుడిపై షాహీద్ అఫ్రిది విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shahid Afridi: ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో ఘోర పరాజయాలు మరవకముందే, పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడా పాకిస్తాన్ పరాజయాలను చవిచూసింది. దీంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఆటగాళ్లు, సెలక్షన్ కమిటీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. పాక్ మాజీ స్టార్ షాహీద్ అఫ్రిది, తన అల్లుడు అని చూడకుండా షాహీన్ అఫ్రిదిపై విమర్శలు గుప్పించారు. ఆదివారం జరిగిన మూడో వన్డేలో సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని పాక్ టీమ్ ఓడిపోయింది.
Read Also: India-Iran: ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం తాజా హెచ్చరికలు ఇవే!
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
ఓటమి తర్వాత షాహీద్ అఫ్రిది ఒక వీడియోలో మాట్లాడుతూ.. బాబర్ అజమ్‌ను జట్టు నుంచి తప్పించడంతో పాటు తన అల్లుడు షహీన్ అఫ్రిదికి కెప్టెన్సీ అప్పగించాలనే నిర్ణయాన్ని ప్రశ్నించారు. పాక్ జట్టులో సర్జరీల పేరుతో నాశనం చేస్తున్నారని పీసీబీ సెలెక్టర్లపై షాహిద్ అఫ్రిది మండిపడ్డారు. “మీరు 2026 T20 ప్రపంచ కప్‌లో ప్రదర్శనలను చూశారు, ఆ తర్వాత మేము బంగ్లాదేశ్ సిరీస్‌ను కూడా 2–1తో కోల్పోయాము. నా అభిప్రాయం ప్రకారం, సెలక్షన్ కమిటీ విమర్శలకు అర్హమైనది. కమిటీలోని మీరందరూ చాలా క్రికెట్ ఆడారు, అయినప్పటికీ ఏ ఫార్మాట్‌కు ఎవరు కెప్టెన్‌గా ఉండాలో మీకు ఇంకా ఆలోచన ఉన్నట్లు లేదు” అని అఫ్రిది అన్నారు.
‘‘ మీరు సర్జరీల పేరుతో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్ ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి సరిపోవు, అలాంటి చోట రెండు మూడు మ్యాచ్‌లు ఆడిన వారికి నేరుగా పాకిస్థాన్ క్యాప్ ఇవ్వడం ఏంటి?’’ అని ప్రశ్నించారు. సీనియర్ ఆటగాళ్లు టీ20 వరల్డ్ కప్‌లో మంచి ప్రదర్శన చేయనప్పటికీ, వన్డేల్లో మంచి రికార్డులు కలిగి ఉన్నారని, అలాంటి వారిని పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..