Bomb Threat: చెన్నై-ముంబై విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల కాలంలో విమానాల్లో, విమనాశ్రయాల్లో ఆకతాయిలు బాంబులు పెట్టామని బెదిరింపు కాల్స్ వస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరిస్తున్నారు. మరోవైపు.. ఇప్పటికి వచ్చిన బెదిరింపు కాల్స్ అన్నీ ఫేక్ అని అధికారులు నిర్థారించారు. ఇదిలా ఉంటే.. తాజాగా మరో విమానానికి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో.. చెన్నై నుండి ముంబైకి వెళ్తున్న ఇండిగో 6E 5314 విమానం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
Hari Hara Veera Mallu: వీరమల్లు దిగుతున్నాడు .. గెట్ రెడీ
Also Read
- Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
- Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
ముంబైలో ల్యాండ్ అయిన అనంతరం.. విమాన సిబ్బంది ప్రోటోకాల్‌ను అనుసరించారు. భద్రతా ఏజెన్సీ మార్గదర్శకాల ప్రకారం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. “ప్రయాణికులందరూ సురక్షితంగా విమానం నుండి దిగారు. ప్రస్తుతం విమానం తనిఖీలో చేపట్టారు. అన్ని భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత, విమానాన్ని టెర్మినల్ ప్రాంతానికి తరలించనున్నారు” అని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.
Loksabha Elections 2024 : హిమాచల్‌లో సుఖూ ప్రభుత్వ భవిష్యత్ నిర్ణయించనున్న ఉప ఎన్నికలు
వారం రోజుల వ్యవధిలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం ఇది రెండోసారి. అంతకుముందు మే 28న ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లే విమానంలో విమానానికి బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు నేపథ్యంలో.. విమానంలోని ప్రయాణికులను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ద్వారం ద్వారా కిందకు దించారు. ఈ సంఘటన వీడియో క్లిప్‌ల్లో ప్రయాణికులు, విమాన సిబ్బంది వారి సామానుతో స్లైడ్‌ల ద్వారా విమానం నుండి ఎలా దిగుతున్నారో చూపించాయి. అయితే.. భద్రతా మార్గదర్శకాల ప్రకారం, ప్రయాణికులు తరలింపు 90 సెకన్లలోపు జరగాలి. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు తమ లగేజీని తీసుకెళ్లకూడదు. మరోవైపు.. ఢిల్లీ ఘటనలో భద్రతా మార్గదర్శకాలను విస్మరించడంతో ఇండిగో ఇద్దరు పైలట్లు, నలుగురు క్యాబిన్ సభ్యులను తొలగించింది.
తాజావార్తలు
-
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
-
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
-
Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!