EV Bike On Subsidy: రూ.లక్ష బండిపై 90 శాతం సబ్సిడీ.. రేపటి నుంచి దరఖాస్తులు…
- ఈవీ వాహనాలపై భారీగా సబ్సిడీ..
- మార్చి 17 నుంచి దరఖాస్తుల ఆహ్వానం..
- నిరుద్యోగ ఎస్సీ యువతకు మాత్రమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ (SC) యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశం కల్పించింది. హైదరాబాద్ కలెక్టరేట్ తాజాగా వెలువరించిన ప్రకటన ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాల (EV) కొనుగోలుపై భారీ సబ్సిడీని ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ పథకం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీలను అందజేస్తోంది. 2 వీలర్ వాహనాల కొనుగోలుపై 90 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. 3 వీలర్ వాహనాలపై 70 శాతం వరకు సబ్సిడీ వర్తిస్తుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. కుల ధృవీకరణ పత్రం (Caste Certificate).. ఎస్సీ వర్గానికి చెందినవారై ఉండాలి. ఆదాయ ధృవీకరణ పత్రం.. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలి. రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమై మార్చి 26వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
Also Read
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఈ విషయాన్ని తెలియజేస్తూ.. అర్హులైన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా పత్రాలను సరిచూసుకోవాలని.. నిర్ణీత గడువులోపు దరఖాస్తు పూర్తి చేయాలని ఆమె సూచించారు.
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!