శ్రీనగర్ హైవేపై ఓ యాపిల్స్ లారీ వెళ్తుండగా.. రాంబన్‌లోని నాచల్నా ప్రాంతంలో బోల్తా పడింది. దీంతో ఈ సంఘటనను చూసిన రోడ్డుపై వెళ్తున్న ట్రక్కు, లారీ డ్రైవర్లు, ప్రయాణికులు, ట్రాఫిక్ పోలీసులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. యాపిల్ బాక్సులన్నీ సురక్షితంగా బయటకు తీసి.. మంచి మనసును చాటుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. మెట్రో మాదిరిగానే బస్సులో ప్రయాణించే వారు కూడా 'నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్' (NCMC) సౌకర్యాన్ని పొందనున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని బస్సుల్లో కూడా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తిరుపతి, ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. రైలులోని ఏసీ బోగీలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు ఆగింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురవడంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరి.. చెరువులను తలపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో కాజీపేట్ రైల్వే స్టేషన్(జంక్షన్)లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. రైల్వే పట్టాల పైకి నీరు రావడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
ఆగి ఉన్న రైలును పునఃప్రారంభించమని ఆరోపిస్తూ ప్రయాణీకులు రైలును నెట్టడం ఓ వీడియోలో కనపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపడంతో పలువురు భారతీయ రైల్వేపై విమర్శలు గుప్పిస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వేకు ఇటీవల హెచ్చరిక లేఖ వచ్చినా...అధికారులు ఎందుకు అప్రమత్తం కాలేదు. ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఘటనాస్థలానికి వెళ్లిన రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్...ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.
NTV కథనాన్ని చూసిన ఎయిర్ ఇండియా అధికారులు వెంటనే స్పందించి మొదట విడతగా 80 మందికి మధ్యాహ్నం 01:30 గంటలకి స్పెషల్ విమానంలో పోర్టు బ్లైర్ కి తరలించారు. మిగతావారిని నెక్స్ట్ ఫ్లైట్ లో పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఢిల్లీకి వెళ్లే ఎయిరిండియా విమానం సోమవారం ఆలస్యం కావడంతో చెన్నై విమానాశ్రయంలో సుమారు 150 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఈ విమానం సోమవారం ఉదయం 10.05 గంటలకు చెన్నై నుంచి బయలుదేరాల్సి ఉంది.