Delhi: ఎయిరిండియా ఫ్లైట్ 20 గంటలు ఆలస్యం.. ప్రయాణికులకు చుక్కలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో విమాన ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. ఓ వైపు హస్తినలో తీవ్రమైన ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అలాంటిది విమాన ప్రయాణం ఆలస్యం కావడం.. 8 గంటల తర్వాత ఎయిర్ కండిషన్ లేని విమానంలో కూర్చోబెట్టడంతో ప్యాసింజర్స్ ఉక్కపోత, వేడితో అల్లాడిపోయారు. చిన్నారులు, వృద్ధులు బెంబేలెత్తిపోయారు. దీంతో ఎయిరిండియా తీరుపై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఎక్స్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేసి.. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకి ట్యాగ్ చేసింది. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Gam Gam Ganesha X Review: ఆనంద్ దేవరకొండ ‘గం..గం..గణేశా’ టాక్ ఎలా ఉందంటే?
Also Read
- Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
- TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
- Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
ఢిల్లీ విమానాశ్రయంలో AI 183 ఎయిరిండియా విమానం ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతుంటే ప్రజలను విమానం ఎక్కించి ఎయిర్ కండిషనింగ్ లేకుండా కూర్చోబెట్టారని ఓ ప్రయాణికురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కొంతమంది స్పృహతప్పి పడిపోయిన తర్వాత ప్రయాణికులను విమానం నుంచి బయటకు వెళ్లమని చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు. కొంత మంది స్పృహ తప్పి పడిపోయిన ఫొటోలను కూడా ఆమె షేర్ చేశారు.
ఇది కూడా చదవండి: Palnadu SP: ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లా పల్నాడు..
నిన్న మధ్యాహ్నం టేకాఫ్ కావాల్సిన శాన్ ఫ్రాన్సిస్కో విమానం 20 గంటల ఆలస్యం తర్వాత ఈరోజు ఉదయం 11 గంటలకు బయలుదేరనుంది. బుధవారం నాడు రికార్డు స్థాయిలో 52.9 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో ఢిల్లీలో తీవ్రమైన వేడిగాలులు వీచాయి. తీవ్రమైన ఎండలు ఉండగా.. కనీసం ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ఎయిరిండియా విమర్శల పాలైంది. ఇక ప్రయాణం ఆలస్యం కావడంపై కేంద్రమంత్రి విచారం వ్యక్తంచేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చేస్తామని హామీ ఇచ్చారు.
If there is a privatisation story that has failed it is @airindia @DGCAIndia AI 183 flight has been delayed for over 8 hours , passengers were made to board the plane without air conditioning, and then deplaned after some people fainted in the flight.This is inhuman! @JM_Scindia pic.twitter.com/86KpaOAbgb
— Shweta Punj (@shwwetapunj) May 30, 2024
@airindia please let mine and the numerous other parents stranded at the boarding area go home!
AI 183 is over 8 hrs late. People were made to board the plane and sit without ac. Then deplaned and not allowed to enter the terminal because immigration was done#inhuman pic.twitter.com/0XdDBAovBK
— Abhishek Sharma (@39Abhishek) May 30, 2024
తాజావార్తలు
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!