సామాన్యుడి విమానంగా పేరుగాంచిన ట్రైన్ జర్నీకి విశేషమైన ఆదరణ ఉంటుంది. తక్కువ ప్రయాణ ఛార్జీలు, సమయం ఆదా అవుతుండడంతో రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు మరో కొత్త సర్వీస్ ను ప్రారంభించింది. బుక్ నౌ, పే లేటర్ అనే సర్వీస్ ను ప్రారంభించింది. ఈ సేవతో మీరు డబ్బులు లేకపోయినా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి చెల్లించకుండానే జీరో పేమెంట్ తో…
సంక్రాంతి పండగకు ఊరెళ్తున్నారా.. అయితే మీ పర్సును ఒకసారి చెక్ చేసుకోండి.. మీరెప్పుడూ చెల్లించే టికెట్ ఛార్జీలకు రెండింతలో.. లేక మూడింతలో చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవచ్చు. మీరెక్కుతున్నది బస్సే కానీ, విమాన ఛార్జీల స్థాయిలో సమర్పించుకోవాల్సిన పరిస్థితి మీకు ఎదురుకావచ్చు.
సెంటిమెంటుని, పండుగల్ని దోచుకునే దందాలో ప్రైవేట్ ట్రావెల్స్ ముందుంటాయనేది ఎప్పట్నుంచో వినిపిస్తున్న మాట! ఫెస్టివల్కి ఇంటికి వెళ్తున్నామన్న సంతోషమే ఉంచరు! పైసో, పరకో పట్టుకెళ్దామన్న ఆశను నిలువునా కూల్చేస్తారు. అడ్డగోలుగా దోచుకుంటారు. అసలు పండుగ వచ్చేది జనాలకు కాదు.. ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్‌కు! టికెట్ రేటు విషయంలో వాళ్ల నోటికి మొక్కాలి! పెంచే రేట్లకు పద్ధతీ పాడూ లేదు.
విజయవాడ-గుంటూరు మధ్య జాతీయ రహదారిపై కాజ వద్ద ఉన్న టోల్‌ప్లాజాలో వాహనదారులు ఒక రోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే.. అన్నిసార్లూ టోల్ మోత మోగుతోంది. కాజ వద్ద మాత్రమే కాదు.. రాష్ట్రంలోని 65 టోల్ ప్లాజాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. టోల్‌ప్లాజాల బీవోటీ గడువు ముగియడంతో.. గత అక్టోబరు నుంచి కొత్త నిబంధన ప్రకారం టోల్ ఫీ వసూళ్లు జరుగుతున్నాయి. దాంతో వాహనదారులపై తీవ్రంగా భారం పడుతోంది. గత సెప్టెంబరు వరకు ఒకసారి వెళితే రూ.160, తిరుగు…
TGSRTC: దూర ప్రాంత ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లో ఆర్టీసీ పికప్ వ్యాన్‌ల సేవలు అమల్లోకి వచ్చాయని ప్రకటించింది. ఈ సేవలు శుక్రవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయని పేర్కొంంది.
దక్షిణ కొరియా రాజధాని సియోల్ నుంచి ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. దక్షిణ కొరియాలోని సబ్‌వేలో పనిచేస్తున్న ట్రైన్ ఆపరేటర్ కొద్దిసేపు విరామం తీసుకోవడంతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. ఈ విరామం కారణంగా 125 రైళ్లు 20 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. కండక్టర్ కొన్ని నిమిషాలు మాత్రమే విరామం తీసుకున్నాడు. కానీ.. ఈ టాయిలెట్ బ్రేక్ ప్రయాణీకులకు ఖరీదైనదిగా మారింది.
సోషల్ మీడియా మోజులో పడి యువత ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఫేమస్ కోసమో.. లేదంటే వ్యూస్ కోసమో తెలియదు గానీ.. ప్రమాదకర స్టంట్లు చేసి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. ఇంకొందరైతే ఇల్లు, బడి అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ.. ఇష్టానురీతిగా పబ్లిక్‌కి ఇబ్బంది కలిగించే విధంగా రీల్స్ చేస్తూ విసుగు పుట్టిస్తున్నారు.
Liquor In Train: భారతదేశంలో కోట్లాది మంది మద్యం సేవిస్తున్నారు. సమాచారం మేరకు, సగటు భారతీయ పౌరుడు సంవత్సరానికి దాదాపు 4.9 లీటర్ల మద్యం తాగుతాడు. మద్యానికి సంబంధించి భారతదేశంలో చాలా చట్టాలు ఉన్నాయి. చట్టం ప్రకారం, భారతీయ పౌరులు ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. అంతే కాకుండా ఏ ఉద్యోగి కూడా మద్యం సేవించి కార్యాలయానికి వెళ్లకూడదు. ఈ నేపథ్యంలో, మద్యంతో రైలులో ప్రయాణించవచ్చా లేదా అనే ప్రశ్న చాలా మందికి ఉన్న ప్రశ్న.…
దసరా పండుగ సందర్భంగా విజయవాడ సందడిగా మారింది. రాష్ట్రం నుంచి దసరాకు వెళ్లే ప్రయాణికులు ఇంటి బాట పడతుండటంతో బస్సులు, రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది. రాష్ట్రం నుంచి తమ సొంతూర్లకు ప్రజలు భారీగా తరలివెళుతున్నారు. దీంతో.. బెజవాడ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారింది.