అవిశ్వాసం పెట్టిన విపక్షాలకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో ప్రధాని మోడీ ప్రసంగించారు. దేవుడే అవిశ్వాసం పెట్టాలని విపక్షాలకు చెప్పారని ఆయన అన్నారు. మూడు రోజులుగా చాలామంది మాట్లాడారని.. 2018లో కూడా అవిశ్వాసం పెట్టారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై బుధవారం రెండో రోజు చర్చ కొనసాగింది. చర్చలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించారు.
ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లుకు లోక్‌సభ ఆమోదించింది. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల వాకౌట్ చేశాయి. విపక్షాల వాకౌట్, నిరసనల మధ్య కేంద్రం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించింది.
మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో ప్రతిష్టంభన మధ్య, ప్రతిపక్షాలు బుధవారం మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకురాబోతున్నాయి. లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మంగళవారం రాత్రి ఈ విషయాన్ని ప్రకటించారు.
విపక్ష ఎమ్మెల్యేలకు నిధుల కేటాయింపుపై మహారాష్ట్రలో దుమారం చెలరేగుతుంది. సోమవారం ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎమ్మెల్యేలు నిధుల కేటాయింపులో విభేదాలపై ఏకనాథ్ షిండే ప్రభుత్వంపై దాడికి దిగాయి వీరితో పాటు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఎదురుదాడికి దిగడం గమన్హారం.
మణిపూర్‌లో జాతి హింసపై పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రతిష్టంభన కొనసాగుతుండగా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం ఈ అంశంపై చర్చకు రావాలని ప్రతిపక్ష పార్టీలకు చేతులను జోడించి విజ్ఞప్తి చేశారు.