PM Modi: అవిశ్వాసం పెట్టిన విపక్షాలకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో ప్రధాని మోడీ ప్రసంగించారు. దేవుడే అవిశ్వాసం పెట్టాలని విపక్షాలకు చెప్పారని ఆయన అన్నారు. మూడు రోజులుగా చాలామంది మాట్లాడారని.. 2018లో కూడా అవిశ్వాసం పెట్టారు. కానీ, విపక్షాలకు ఎంత మంది ఉన్నారో.. అన్ని ఓట్లు కూడా రాలేదని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. 2024లో ఎన్డీయే కూటమి అన్ని రికార్డులు బద్ధలు కొడుతుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై దేశ ప్రజలు పదే పదే విశ్వాసం చూపిస్తున్నారని.. కోట్లాది దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి తాము ఇక్కడ ఉన్నామన్నారు. ఇది విపక్షాలకే పరీక్ష అని తెలిపిన ప్రధాని.. అవిశ్వాస తీర్మానం కేంద్ర సర్కారుకు శుభపరిణామేనని పేర్కొన్నారు.
Also Read: Tomato Price: దిగొస్తున్న టమాటా ధరలు.. మదనపల్లి మార్కెట్లో కిలో ధర ఎంతంటే..!
అధీర్‌ను ఎందుకు మాట్లాడనివ్వలేదు.. కోల్‌కతా నుంచి ఫోన్ వచ్చిందేమోనంటూ ప్రధాని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు టైం ఇచ్చినా విపక్షాలు సిద్ధం కాలేదన్నారు. విపక్షాలకు పేదల భవిష్యత్ కంటే అధికారమే ముఖ్యమైపోయిందని ప్రధాని విమర్శించారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని ఆయన ఆరోపించారు. విపక్షాలకు అధికార దాహం పెరిగిందని మోడీ తెలిపారు. ఫీల్డింగ్ విపక్షాలు చేస్తుంటే.. సిక్స్‌లు, ఫోర్లు తమ వైపు వచ్చి పడ్డాయని ప్రధాని పేర్కొన్నారు. 2018లో నో కాన్ఫిడెన్స్.. నో బాల్‌గానే మిగిలిపోయిందని ఆయన చెప్పారు. దేశంలో ఎంత బలపడిందో చెప్పడానికి విదేశీ పెట్టుబడులే నిదర్శమన్నారు ప్రధాని మోడీ.
Also Read: Uttarapradesh : దారుణం..యూపీలో మైనర్ దళిత బాలికపై అత్యాచారం..
ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశ ప్రతిష్టను ఖండాంతరాలకు విస్తరింపజేశామన్నారు. స్కామ్‌లు లేని ప్రభుత్వాన్ని దేశానికి ఇచ్చామన్నారు. దేశ ప్రజల్ని ఇండియా కూటమి తప్పుదోవ పట్టిస్తోందని ప్రధాని మోడీ మండిపడ్డారు. జల జీవన్ మిషన్, స్వచ్చ భారత్, అభియాన్‌లు లక్షలాది మంది జీవితాల్ని నిలబెట్టాయన్నారు. మన సంక్షేమ పధకాల్ని ఐఎంఎఫ్ ప్రశంసించిందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. హెచ్‌ఏఎల్‌పై ఇష్టానుసారం మాట్లాడారని.. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశారని.. ఎన్నో అసత్యాలు ప్రచారం చేశారని విపక్షాలపై ప్రధాని విరుచుకు పడ్డారు. చర్చ సమయంలో విపక్షాలు మాట్లాడిన ప్రతీ మాటా దేశం మొత్తం విన్నదని.. భారత్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు విపక్షాలు ప్రయత్నించాయని ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానానికి చేరుకుంటామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత్ ఎదుగుదలను ప్రపంచం ప్రశంసిస్తోందన్నారు. ఎల్‌ఐసీ ఇప్పుడు ఎంతో పటిష్టంగా ఉందని.. ఎల్‌ఐసీ ప్రైవేటీకరణతో పేదల డబ్బులు పోతాయని ప్రచారం చేశారంటూ.. విపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ.
Also Read: Uttarakhand: రాష్ట్రాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు.. తొమ్మిది మంది మృతి..
కాంగ్రెస్ హయాంలో భారత్ పేదరికంల మగ్గిపోయిందని.. కాంగ్రెస్‌కు నిజాయతీ, విజన్ లేదని ప్రధాని విమర్శించారు. 2014 తర్వాత ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలోభారత్ ఐదో స్థానానికి చేరిందన్నారు. భారత సైన్యాన్ని కాంగ్రెస్ విశ్వసించడం లేదని ప్రధాని మోదీ గురువారం అన్నారు. 2028లో ప్రతిపక్షాలు మరో అవిశ్వాస తీర్మానం పెడతాయని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ప్రధాని జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలు ఎవరిని దూషించినా అంతిమంగా అభివృద్ధి చెందుతారనడానికి తానే ఉదాహరణ అంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.