మహారాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనల మధ్య విపక్షాల రెండో సమావేశం వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సమావేశం ఈనెల 17, 18 తేదీల్లో బెంగళూరులో జరగనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర సంస్థలను ఉపయోగించుకుని విపక్షాలను వేధిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ నేత ఎంపీ శతృఘ్నసిన్హా వ్యాఖ్యానించారు.
విపక్షాల రెండో సమావేశం బెంగళూరులో వచ్చే నెల 13వ తేదీ, 14వ తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు శరద్ పవార్ తెలిపారు. బెంగుళూరులో విపక్షాల భేటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే కొందరు నేతలను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పవార్ వెల్లడించారు. వచ్చే నెల మధ్యలో వర్షాలు ఉధృతంగా కురుస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో షిమ్లాలో సమావేశ నిర్వహణ సరైన నిర్ణయం కాకపోవచ్చనే అభిప్రాయానికి ప్రతిపక్షాలు వచ్చాయి. వాతావరణ…
యూపీఏ.. కాంగ్రెస్ సారథ్యంలో పదేళ్లపాటుదేశాన్ని ఏలిన ఐక్య ప్రగతిశీల కూటమి. 19 ఏళ్లుగా ఆ కూటమిని కాంగ్రెస్ లీడ్ చేసింది. అయితే ఇకపై ఈ పేరు కనుమరుగు కాబోతోందని జాతీయ రాజకీయాల్లో టాక్ నడుస్తోంది.
పొత్తుపై మాయావతి ఆలోచన చేస్తున్నారా..? ప్రతిపక్ష ఐక్యతపై బీఎస్పీ కన్ను పడిందా?. బీహార్ రాజధాని పాట్నాలో జూన్ 23న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో జరగనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశంలో బీఎస్పీకి చోటు దక్కలేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా అడుగులు వేయాలనుకున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం బీఎస్పీ విడుదల చేసిన ప్రెస్ నోట్ ద్వారా విపక్షాల ఐక్యతపై బీఎస్పీ కన్నేసిందని స్పష్టంగా తెలుస్తోంది. ఎస్పీ అధినేత్రి మాయావతి 2024 లోక్‌సభ…
కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ.. అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన అమెరికా వేదికగా బీజేపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. మోడీ సర్కారు భారత ప్రజలను భయపెడుతోందని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలోని విపక్ష పార్టీలు ఏకం అవుతున్నాయి. ఈ క్రమంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కలిసిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశం పార్లమెంట్ ఉభయసభనలు కుదిపేసింది. రాహుల్ గాంధీని పార్లమెంటుకు అనర్హులుగా ప్రకటించడంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్ సభ, రాజ్యసభ రెండూ వాయిదా పడ్డాయి.
రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. టి నుంచి ప్రారంభం కానున్న రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ఆమోదం, గ్రాంట్లపై చర్చ చేపట్టనున్నారు.