Parliament Session: లోక్‌సభ స్పీకర్ సభకు వచ్చేలా చూడాలని.. ఆయనను సభకు రమ్మనండి అని ప్రతి పక్ష సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి ప్రతిపక్షాలు మణిపూర్ సమస్యపై పార్లమెంటులో చర్చించాలని పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మణిపూర్ అంశంపై ఇటు ప్రతిపక్షాలు.. అటు అధికారపక్షం వ్యవహారిస్తున్న తీరుపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసంతృప్తి వ్యక్తం చేసిన లోక్‌సభ స్పీకర్ నిన్న, ఈరోజు కూడా సభకు హాజరు కాలేదు. దీంతో లోక్‌సభను సీనియర్ ఎంపీలు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహారిస్తూ సభను కొనసాగిస్తున్నారు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం సభ వాయిదా పడేకంటే ముందు ప్రతిపక్షాలు సభను నిర్వహిస్తున్న సీనియర్ ఎంపీ అయిన రాజేంద్ర అగర్వాల్‌కు స్పీకర్ సభకు వచ్చేలా చూడాలని .. ఆయన ఈ సభకు సంరక్షుడని.. సభకు వచ్చేలా చూడాలని కోరారు.
Read also: Telangana Assembly: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటల వద్దకు కేటీఆర్..!
వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి పార్లమెంట్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఉభయ సభలను మణిపూర్ అంశం కుదిపేస్తోంది. ఆ రాష్ట్రంలో ఘర్షణలపై గురువారం కూడా విపక్ష సభ్యులు(Opposition MPs) నిరసనలు కొనసాగించడంతో లోక్‌సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. ప్రస్తుతం రాజ్యసభ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మణిపూర్ అంశంపై చర్చను ముందుకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన మార్గాలపై మాట్లాడేందుకు మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశం అవుదామని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సభ్యులను కోరారు. దానిపై సభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందించారు. అప్పటి వరకు సభను వాయిదా వేయాలని కోరారు. అలాగే మణిపూర్‌పై చర్చ విషయంలో ఛైర్మన్ ఎందుకు ప్రధానిని కాపాడుతున్నారని ఖర్గే ప్రశ్నించారు. ‘నేను ఎవరిని రక్షించాల్సిన అవసరం లేదు. రాజ్యాంగాన్ని, సభ్యుల హక్కులను కాపాడటమే నా విధి. మీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు’ అని ఛైర్మన్ ఘాటుగానే బదులిచ్చారు.
Read also: Tomato Price: పెరుగుతున్న టమోటా ధరలు.. కొద్దిరోజుల్లో రూ. 400?
లోక్‌సభ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష ఎంపీల తీరుపై అసంతృప్తితో ఉన్న స్పీకర్ ఓం బిర్లా(Om Birla) సభకు హాజరుకావడం లేదు. ఆయన రాకపోవడంతో నిన్న, నేడు ఆ బాధ్యతలను ఇతర సీనియర్ ఎంపీలు నిర్వర్తిస్తున్నారు. ఈరోజు(గురువారం) రాజేంద్ర అగర్వాల్ లోక్ సభను నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనకు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ ఓ అభ్యర్థన చేశారు. ఓం బిర్లా సభకు వచ్చేలా చూడాలని రాజేంద్ర అగర్వాల్‌ను కోరారు. ఆయనే ఈ సభకు సంరక్షకుడని అన్నారు. దీనిపై అగర్వాల్ స్పందించారు. ‘మీ అభ్యర్థనను ఆయనకు వెల్లడిస్తానని చెప్పారు.