18వ లోక్‌సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీతో సహా కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ మీడియాతో మాట్లాడుతూ మూడోసారి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పని చేస్తామని, మూడో దశ లో మూడు రెట్లు ఎక్కువగా పనిచేస్తామని చెప్పారు. మరోవైపు, కాంగ్రెస్‌పై విరుచుకుపడిన మోదీ, ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. 50 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ విధించిన విషయాన్ని గుర్తుచేశారు. మంచి విపక్షం అవసరం అని,…
పదేళ్ల తర్వాత లోక్‌సభలో కాంగ్రెస్ తన ప్రతిపక్ష నేతను నియమించుకోనుంది. అందుకోసమని.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో రాహుల్ గాంధీని లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా అభ్యర్థించారు. అయితే.. రాహుల్ గాంధీ తన నిర్ణయంపై ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ క్రమంలో.. సోమవారం కాంగ్రెస్ విలేకరుల సమావేశంలో ఒక ఆసక్తికరమైన సంఘటన కనిపించింది. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా అంగీకరించకపోతే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తనను బెదిరించారని రాహుల్ గాంధీ చెప్పారు. అయితే ఈ విషయం…
PM Modi: బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. ‘‘పాకిస్తాన్ అణుశక్తికి బయపడే పిరికివాళ్లు’’గా అభివర్ణించారు.
కాంగ్రెస్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎలక్టోరల్ బాండ్ల వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం అని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు
PM Modi slams Opposition over Parliament Ruckus: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షం తీవ్ర నిరాశకు గురైందని, అందుకే పార్లమెంట్ నిర్వహణకు అడ్డుపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశానికి ఉజ్వల భవిష్యత్తు అందించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంటే.. కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోయాలని ‘ఇండియా కూటమి’ లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. మంగళవారం ఉదయం న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల వ్యవహారశైలిపై ఎంపీలతో చర్చించారు.…
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను రూ.200 తగ్గించడంపై రాజకీయాలు మొదలయ్యాయి. అధికార పార్టీ.. రక్షా బంధన్‌కు ముందు దేశంలోని సోదరీమణులకు ప్రధాని మోడీ ఇచ్చిన బహుమతి అని అటుండగా.. మరోవైపు కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష కూటమి ఎన్నికల బహుమతిగా విమర్శలు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. ఇది ఎన్నికల లాలీపాప్‌గా అభివర్ణించారు.
మోడీ సర్కారుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ స్పందించడంతో ప్రతిపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. వాకౌట్‌పై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ప్రశ్నలు లేవనెత్తే వారికి సమాధానాలు వినే ధైర్యం లేదంటూ ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ గురువారం కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. భారతదేశాన్ని అవమానించడంలో ఆ పార్టీ ఆనందం పొందుతుందని అన్నారు. ఆ పార్టీ ఏ చిన్న సమస్యనైనా తీసుకుంటుందని, భారతదేశాన్ని పరువు తీయడానికి విలేకరుల సమావేశాలు నిర్వహిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ప్రధాని మోదీ.. ఆ పార్టీపై భారత ప్రజలకు విశ్వాసం లేదని అన్నారు.