ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరూ ఊహించని పేరును కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణకు చెందిన బి.సుదర్శన్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.
Monsoon session: సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి కిరెన్ రిజిజు అన్నారు. కేంద్రం ఏ అంశానికి దూరంగా ఉండదని, సభ సజావుగా నడిచేందుకు కట్టుబడి ఉందని ఆయన ఆదివారం అన్నారు. అఖిలపక్ష సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ.. సభ సక్రమంగా జరిగేలా ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సమన్వయం ఉండాలని కోరారు.
లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల నియామకంపై స్పష్టత ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలను, తప్పుడు ప్రచారాలను తోసిపుచ్చుతూ.. వక్ఫ్ బోర్డులో ముతవల్లీ ముస్లిం మాత్రమే ఉంటారని తెలిపారు. అన్యమతానికి చెందిన ఏ సభ్యుడినీ అనుమతించబోమని చెప్పారు. కొత్త చట్టం ప్రకారం.. వక్ఫ్ బోర్డులోని ముస్లిమేతరులు మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోరని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
కర్ణాటకలో రహదారుల పేర్ల వ్యవహారం దుమారం రేపుతోంది. మైసూరులోని ఒక రోడ్డుకు సిద్ధరామయ్య పేరు పెట్టాలని మైసూర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదన చేసింది. ఇందుకు ప్రజల నుంచి 30 రోజుల్లోగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది.
వక్ఫ్ (సవరణ) బిల్లుపై దర్యాప్తు చేస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఛైర్మన్ ఏకపక్ష నిర్ణయాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశాయి. తాము జేపీసీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని విపక్ష ఎంపీలు హెచ్చరించారు. లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును పరిశీలించే బాధ్యతను జగదాంబిక పాల్ నేతృత్వంలోని జేపీసీకి అప్పగించిన విషయం తెలిసిందే.
Mahesh Kumar Goud: తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని టీపీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ నేత మైనంపల్లి ఇంటికి మహేష్ కుమార్ వెళ్లారు.
Jagga Reddy: విమర్శలకు సమయం కాదు..ప్రభుత్వం..ప్రతిపక్షం కలిసి ప్రజల్ని ఆదుకుందామని పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంత్రులంతా వరద బాధితుల సేవలోనే ఉన్నారని తెలిపారు.
కొత్తగా కొలువు తీరిన లోక్‌సభ స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి గురించి కూడా చర్చ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ, “విపక్షాలు డిప్యూటీ స్పీకర్ ఎవరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ ఎవరో తేలిస్తేనే స్పీకర్‌కు మద్దతు ఇస్తామని విపక్షాలు అంటున్నాయి. ఇలా రాజకీయాలు చేయడం సరికాదు” అని తెలిపారు. “డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వాలని ఎలాంటి నిబంధన లేదు. లోక్సభకు ఎలాంటి ప్రతిపక్షం లేకుండా అన్ని…