Lok Sabha Passed Delhi Services Bill : ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లుకు లోకసభ ఆమోదం… బిల్‌కి నిరసనగా ప్రతిపక్షాలు వాకౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Passed Delhi Services Bill: ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లుకు లోక్‌సభ ఆమోదించింది. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల వాకౌట్ చేశాయి. విపక్షాల వాకౌట్, నిరసనల మధ్య కేంద్రం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించింది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును.. ఢిల్లీ సేవల బిల్లు, అధికారికంగా ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు- 2023 అని పిలుస్తారు. ఈ బిల్లు గురువారం లోక్‌సభలో ఆమోదించబడింది. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష ఎంపీలు నిరసనగా వాకౌట్ చేశారు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు చాలా సేవలపై ఢిల్లీ ప్రభుత్వానికి నియంత్రణను ఇస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలను భర్తీ చేసే ప్రస్తుత ఆర్డినెన్స్.
Read also: Space : అంతరిక్షంలో మనుషులు చనిపోతే.. మృతదేహాలను ఏం చేస్తారో తెలుసా?
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఢిల్లీకి ‘పూర్తి రాష్ట్ర హోదా’ ఇస్తామని బీజేపీ గతంలోనే హామీ ఇచ్చిందని అన్నారు. బదిలీ పోస్టింగ్‌లపై రాష్ట్ర నియంత్రణను తీసివేసే బిల్లుపై నిరాశను వ్యక్తం చేసిన కేజ్రీవాల్, “ఈ రోజు, ఈ వ్యక్తులు (బిజెపి) ఢిల్లీ ప్రజలను వెన్నుపోటు పొడిచారు” అని అన్నారు. ‘ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తామని బీజేపీ పదే పదే హామీ ఇచ్చింది. 2014లో మోదీ స్వయంగా ప్రధాని అయ్యాక ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఢిల్లీ ప్రజల వెన్నుపోటు పొడిచారు. ఇక నుంచి మోదీ జీని నమ్మొద్దు’’ అని అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ (గతంలో ట్విటర్‌గా పిలిచేవారు)లో పేర్కొన్నారు.
Read also: SIIMA 2022: బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో జక్కన్నతో పోటీలో ఆ నలుగురు కుర్ర దర్శకులు
ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలు అన్ని పక్షాలు పాల్గొన్నాయి. ఢిల్లీ ఆర్డినెన్సు బిల్‌పై చర్చ సందర్భంగా ఆప్ ఎంపి సుశీల్ కుమార్ రింక్ వెల్‌లోకి దూసుకెళ్లి బిల్ పేపర్లను చింపి స్పీకర్ టేబుల్‌పైకి విసిరి తమ నిరసనను వ్యక్తం చేశారు. స్పీకర్ టేబుల్ పై కాగితాలు విసిరేసి, సభాగౌరవానికి భంగం కలిగించినందుకు ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రింక్‌ను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ వర్షాకాల సమావేశాలు పూర్తయ్యేంత వరకు సభ కార్యక్రమాలకు హాజరుకాకుండా రింకు ను సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. చర్చ అనంతరం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సభకు సమాధానం ఇచ్చారు. దేశ రాజధానిలో బ్యూరోక్రాట్‌లను ఎవరు నియంత్రిస్తారనే దానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును హోంమంత్రి అమిత్ షా సమర్థించారు.”ఈ ఆర్డినెన్స్ జాతీయ రాజధాని ఢిల్లీకి సంబంధించిన ఏదైనా అంశంపై చట్టాలను రూపొందించే హక్కు పార్లమెంటుకు ఉందని సుప్రీం కోర్టు ఆదేశాన్ని సూచిస్తుంది. ఢిల్లీ కోసం చట్టాలు చేయడానికి కేంద్రాన్ని అనుమతించే నిబంధనలు రాజ్యాంగంలో ఉన్నాయి” అని ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు- 2023ని ప్రస్తావిస్తూ అమిత్ షా అన్నారు.
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!