ఇవాళ రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుండటం, అలాగే ఢిల్లీలో విపక్ష పార్టీలు సమావేశం అవనుండటంతో… హస్తినలో జరిగే రాజకీయ పరిణామాలపై పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తి నెలకొంది. జులై 24వ తేదీన రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. 25వ తేదీలోపు కొత్త రాష్ట్రపతి ఎన్నుకోవాల్సి ఉంది. ప్రెసిడెంట్ ఎన్నికకు సంబంధించి… నేడు నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. వచ్చే నెల 18న ఎన్నికలు, 21న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఎలక్టరోరల్ పద్ధతిలో రాష్ట్రపతి ఎన్నిక…
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితం తెలంగాణ భవిష్యత్ రాజకీయ గమనాన్ని నిర్ధేశించనుంది. కేసీఆర్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా బలమైన ఓ ప్రచార నినాదాన్ని నిర్మించడానికి హుజూరాబాద్ విజయం దోహదం చేస్తుంది. టీఆర్‌ఎస్ గెలిస్తే పార్టీపై కేసీఆర్ ఉక్కు పిడికిలి మరింత బిగుసుకుంటుంది. సమీప భవిష్యత్తులో…
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో.. భారత్ వ్యాక్సినేషన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పంపిణీ చేస్తోంది.. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు కూడా కావడంతో.. శుక్రవారం దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో వ్యాక్సినేషన్ జరిగింది.. ఒకే రోజు ఏకంగా 2.50 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు.. కోవిన్ పోర్టల్ సమాచారం ప్రకారం రాత్రి 12 గంటల వరకు వేసిన డోసుల సంఖ్య 2.5 కోట్లు దాటేసింది.. ఇక, ఒక రోజులో కోటికి…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న అంశం పెగాసస్… ఉభయసభల్లోనూ ఇదే వ్యవహారం రభస సృష్టిస్తోంది… పెగాసస్ వ్యవహారంపై ప్రభుత్వం చర్చించాల్సిందేనంటూ 9 రోజులుగా ప్రతిపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తున్నాయి. అలాగే 50 పని గంటల్లో 40 పనిగంటలను సభ కోల్పోయిందని అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలకు జరిగిన అవాంతరాల వల్ల 133 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.. అయితే, ప్రతిష్ఠంభన తొలగిపోయేందుకు ఏమాత్రం సూచనలు కూడా కనిపించడంలేదు.. పెగసస్ వివాదం కారణంగా,…