విపక్ష ఎమ్మెల్యేలకు నిధుల కేటాయింపుపై మహారాష్ట్రలో దుమారం చెలరేగుతుంది. సోమవారం ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎమ్మెల్యేలు నిధుల కేటాయింపులో విభేదాలపై ఏకనాథ్ షిండే ప్రభుత్వంపై దాడికి దిగాయి వీరితో పాటు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఎదురుదాడికి దిగడం గమన్హారం. ఎమ్మెల్యేలకు ఇచ్చిన నిధులను ప్రస్తావిస్తూ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత అంబదాస్ దాన్వే మండిపడ్డారు. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వలేదని.. ఇది చాలా తప్పు అని ఆయన పేర్కొన్నారు. నిధులు ఇవ్వని ఎమ్మెల్యేలు.. వారి ప్రాంతాల్లో నివసించే పౌరులు పన్నులు చెల్లించలేదా అని దన్వే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. షిండే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తోందని దుయ్యబట్టారు.
Kunamneni Sambasiva Rao : బీఆర్‌ఎస్ మాకు మిత్రులే.. కానీ హరీష్ ఆ మాట ఎందుకు అన్నారో తెలియదు
మరోవైపు దాన్వే ఆరోపణలపై.. షిండే వర్గం ఎమ్మెల్యేలు భరత్ గోగ్వాలే, సంజయ్ శిర్సత్ స్పందించారు. ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఇస్తున్న నిధులు వ్యక్తిగత పనుల కోసం కాదని అన్నారు. ప్రతిపక్ష నేతల కంటే ప్రభుత్వంలో భాగస్వామ్యులైన వారికే ఎక్కువ నిధులు వస్తాయని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో శివసేన-కాంగ్రెస్, నేషనలిస్ట్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అధికార ఎమ్మెల్యేలకే ఎక్కువ నిధులు కేటాయించారన్నారు. ఈరోజు తమ ప్రభుత్వం ఉంది కాబట్టి దాని ప్రయోజనం పొందుతున్నాట్లు తెలిపారు.
Tillu Square: రాధికాతో అంత జరిగినా కూడా సిగ్గు రాలే టిల్లు అన్నకు..
ఎమ్మెల్యేల నిధుల విషయంలో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే మాట్లాడిన అంశం తెరపైకి వచ్చింది. తమ ప్రభుత్వంలో ఎవరికీ సమాన నిధులు ఇవ్వలేదని.. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని పటోలే అన్నారు. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వ దివాళాకోరుతనం బయటపడిందని ఆరోపించారు.