Nirmala Sitharaman: ప్రతిపక్షాలది మొసలి కన్నీరు.. మణిపూర్ అంశంపై స్పందించిన కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitharaman: మణిపూర్ అంశంపై కేంద్ర మంత్రులు వరుసగా స్పందిస్తున్నారు. మణిపూర్ అంశాన్ని అడ్డుపెట్టుకొని పార్లమెంటు సమావేశాలు నడవకుండా చేస్తున్నారని మండిపడ్డారు. వీధుల్లో నిరసనలు చేయకుండా పార్లమెంటులో చర్చిద్దామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రతిపక్షాలను విమర్శించగా.. మణిపూర్ అంశంపై విపక్షాలది మొసలి కన్నీరని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మణిపూర్ అంశం కుదిపేస్తుంది. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ పార్లమెంట్‌లో సమగ్ర ప్రకటన చేయాలని విపక్ష కూటమి ఇండియా డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఉభయసభలలో వాయిదాల పర్వం కొనసాగుతుంది. అయితే తాజాగా ఈ పరిణామాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. మణిపూర్ అంశంపై చర్చకు దూరంగా విపక్షాలు పారిపోతున్నాయని విమర్శించారు. మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నారని.. చర్చలో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదని మండిపడ్డారు.
Read also: Shobu Yarlagadda: ఆటిట్యూడ్ తో హిట్ సినిమా వదులుకున్న ఆ హీరో ఎవరు.. ?
Also Read
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
‘‘మణిపూర్ అంశంపై చర్చలో పాల్గొనేందుకు విపక్షాలు ఇష్టపడడం లేదు. గత ఎనిమిది రోజులుగా మణిపూర్‌పై చర్చించాలని కోరిన విపక్షాలు ఈరోజు చర్చలో పాల్గొనలేదు. ఈరోజు ఈ అంశం పార్లమెంట్‌లో చర్చకు రాగానే విపక్షాలు చర్చకు దూరంగా పారిపోయాయి. విపక్షాల తీరు పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. వారికి(ప్రతిపక్షాలకు) మణిపూర్ కేవలం రాజకీయ అంశం. ప్రతిపక్షాలు మణిపూర్ సమస్యపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఈ రోజు రుజువైంది. వారు నిజంగా శ్రద్ధ వహిస్తే దానిపై చర్చించి ఉండేవారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈరోజు ఉదయం రాజ్యసభ ప్రారంభమైనప్పటీ నుంచి మణిపూర్ అంశంపై 267వ నిబంధన ప్రకారం ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. అయితే ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2 గంటలకు మణిపూర్ అంశంపై ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రతిపక్షాల ఆందోళనలతో రెండు వాయిదాల అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి సమావేశమైన సమయంలో.. రూల్ 176 ప్రకారం మణిపూర్ సమస్యపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం అంగీకరించిందని, చర్చను ప్రారంభించాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ పేర్కొన్నారు. అయితే రూల్ 267 కింద చర్చకు ప్రతిపక్ష పార్టీల సభ్యులు పట్టుబట్టారు. అయితే తాను రూల్ 267 కింద నోటీసులను నేను అంగీకరించలేదని.. వాటిని తాను తిరస్కరించానని రాజ్యసభ చైర్మన్ తెలిపారు. ఈ క్రమంలోనే సభలో గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను తొలుత మధ్యాహ్నం 2.30 గంటలకు, తర్వాత 3.30 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో సభను రాజ్యసభ చైర్మన్ మంగళవారానికి వాయిదా వేశారు.
తాజావార్తలు
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?