ఈనెల 14 నుంచి వారాహి యాత్ర ప్రారంభమవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ ప్రచార యాత్ర ఉభయ గోదావరి జిల్లాల్లో షెడ్యూల్ ఖరారు చేశారు. క్షేత్ర స్థాయిలో సమస్యలను ప్రస్తావించేలా కార్యక్రమాలు ఉండబోతున్నట్లు నాదెండ్ల తెలిపారు.
జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిలీపట్నంలో జరిగే ఆవిర్భావ సభకు పవన్ కల్యాణ్ వారాహి వాహనంలో వెళ్లనున్నారు. అయితే, సభ నేపథ్యంలో రహదారులపై ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పష్టం చేశారు.
జనసేన పార్టీ పదో వార్షిక ఆవిర్భావ సభ ఈ రోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహిస్తున్నారు. సభకు పవన్ తన ప్రచార రథం వారాహిలో రానున్నారు. ఈ సభ ద్వారా కార్యకర్తలకు, నాయకులకు ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మెగా బ్రదర్ నాగబాబు.. తాజాగా మెగా బ్రదర్స్పై కామెంట్లు చేసిన నారాయణ.. చిరంజీవి ఊసరవెళ్లి లాంటి వ్యక్తి అని.. ఆయన్ను అసలు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు తీసుకు రావాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.. ఇక, పవన్ కల్యాణ్ ల్యాండ్ మైన్ లాంటి వాడు.. అది ఎక్కడ పేలుతుందో.. ఎవరిపై.. ఎప్పుడు పేలుతుందో కూడా తెలియదని..…