ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఏపీ మంత్రివర్గంలో చోటుదక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై త్వరలో నిర్ణయం వెలువడనుంది. ప్రస్తుతం నాగబాబు జనసేన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Sri Reddy: సినీ నటి , వైసీపీ మద్ధతుదారురాలైన శ్రీరెడ్డి, గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బాధపడుతూ, ఇప్పుడు క్షమాపణలు కోరారు. అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, వంగలపూడి అనిత వంటి నేతలపై ఆమె సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆమె చిన్నా పెద్దా అని భేదం చేయకుండా తన అభిప్రాయాలను పంచుకుంటూ, వైసీపీకి మద్దతు తెలిపింది. అయితే, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె…
నామినేటెడ్ పోస్టుల భర్తీ టీడీపీకి ఛాలెంజింగ్గా మారింది. పెద్ద ఎత్తున ఆశావహులు ఉండటంతో నామినేటెడ్ పదవుల భర్తీ కత్తి మీద సాములా మారింది. టీటీడీ, ఏపీఎస్సార్టీసీ, ఏపీ ఎండీసీ, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్ఐడీసీ, పీసీబీ, అప్కాబ్, మార్క్ ఫెడ్, దుర్గ గుడి ఛైర్మన్ వంటి కీలక పదవులకు డిమాండ్ పెరిగింది.
రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజులో 95 శాతం మేర పెన్షన్లు పంపిణీ చేసింది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం.. సాయంత్రం ఏడుగంటల సమయానికి దాదాపు 94.15 శాతం మేర పంపిణీ పూర్తి చేసింది.
రెండ్రోజుల్లో అన్ని స్టాక్ పాయింట్లలో తనిఖీలు పూర్తి చేయాలని సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. సివిల్ సప్లయిస్ కార్యాలయంలో తూనికలు కొలతలు విభాగపు అధికారులతో సివిల్ సప్లయిస్ మంత్రి మనోహర్ నాదెండ్ల సమీక్షించారు.
పదేళ్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోరాటానికి ఫలితం లభించింది. గత పదేళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజల తరఫున కొట్లాడారు. రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయినా.. వెనకడుగు వేయలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా మూడోసారి ఎన్నికల్లో పోటీ చేశారు.
మేదరమెట్ల సిద్ధం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వాగ్దానాలకు, శకుని చేతిలో పాచికలకు తేడా లేదు అని దుయ్యబట్టారు. చంద్రబాబు.. 2014లో ఇచ్చిన హామీలు ఒక్కటైన అమలు పరిచారా ? అని ప్రశ్నించారు. మళ్లీ పొత్తు పెట్టుకుని ఇంతకు మించి హామీలు ఇచ్చి మీ దగ్గరకు రావడానికి రెడీ అయ్యారని సీఎం జగన్ తెలిపారు. ప్రజలకు మంచి చేయక పోగా ప్రజలకు మంచి చేసిన జగన్ ని టార్గెట్ చేస్తున్నారని దుయ్యబట్టారు.