ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయినప్పటికీ రాజకీయ పార్టీలు ‘ముందస్తు’ వ్యూహాలను సిద్ధం చేసుకుంటుండటం ఆసక్తిని రేపుతోంది. అధికారంలోకి ఉన్న వైసీపీ దగ్గర నుంచి ప్రతిపక్షాలన్నీ కూడా ఎన్నికల మూడ్ లోకి వెళ్లడంతో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు టీడీపీ, జనసేన పార్టీలు మళ్లీ ఏకం అవుతాయా? అనే చర్చ సైతం ఏపీలో జోరుగా సాగుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోనూ రాజకీయంగానూ ఫుల్…
ప్రతీకార రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ తమిళనాడు. గత నలబై ఏళ్ల నుంచి తమిళ నాట రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కానీ కొత్త సీఎం దానికి ముగింపు పలికినట్టే కనిపిస్తోంది. పనికి రాని పనులు మాని రాష్ట్ర పురోగతిపై ఫోకస్ పెట్టారు సీఎం ఎం కే స్టాలిన్. ప్రస్తుతం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది రాజకీయ సంచలనంగా మారుతోంది. అదే సమయంలో ఆయనపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని…