Vijay Sai Reddy: ఆరు అంశాలపై సీఈసీకి నివేదిక.. గుర్తింపులేని జనసేనకు ఎందుకు ఆహ్వానం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Sai Reddy: ఏపీ పర్యటనలో ఉన్న సీఈసీ బృందాన్ని వరుసగా కలుస్తున్నాయి రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీఈసీ బృందాన్ని కలిశారు ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి.. సీఈసీకి మొత్తం ఆరు అంశాలపై నివేదిక అందించాం అన్నారు. అయితే, జనసేనకి గుర్తింపు లేకున్నా ఎందుకు ఆహ్వానించారని అడిగాం. పొత్తులో భాగంగా టీడీపీ అడిగిందని చెప్పారన్నారు. గ్లాస్ గుర్తు సాధారణ గుర్తు.. సాధారణ గుర్తు కలిగిన పార్టీ కొన్ని స్థానాల్లో పోటీ చేయటం అనేది చట్ట విరుద్ధం అన్నారు. కోనేరు సురేష్ అనే వ్యక్తి సీఈవోకి కంప్లైంట్ ఇచ్చారు.. ఇతను టీడీపీలో కీలకంగా వ్యవహారిస్తున్నాడని.. కర్నూల్ జిల్లాలో 67,370 బోగస్ ఓట్లు ఉన్నాయని సురేష్ కంప్లైంట్ ఇచ్చాడు.. కానీ, అక్కడ వెరిఫికేషన్ చేశాక 87శాతం నిజమైన ఓట్లు ఉన్నాయని గుర్తించారని తెలిపారు.
Read Also: KA Paul: సీఎం క్యాంప్ ఆఫీసుకు కేఏ పాల్.. అపాయింట్‌మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తా..!
Also Read
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ఈసీ వెరిఫికేషన్ అనంతరం చాలా వరకు సరైన ఓటర్లు ఉన్నారని గుర్తించారని పేర్కొన్నారు సాయిరెడ్డి.. తప్పు దోవ పట్టించిన కోనేరు సురేష్ వంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశాం అన్నారు. ఇక, రెడ్ బుక్ పేరుతో అధికారులపై నారా లోకేష్ చేస్తున్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరాం అన్నారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణకు కూడా ఒకేసారి లోక్ సభ ఎన్నికలు పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్టు వెల్లడించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.
తాజావార్తలు
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?