Adapa Seshu: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు ఫైరయ్యారు. పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనేదే పవన్ తాపత్రయమని ఆయన వ్యాఖ్యానించారు. “నిన్ను చూసుకోమని మేం ఏ భార్యకు చెప్పాలి పవన్?.. నీ మొదటి పెళ్లానికా…రెండో పెళ్లానికా…మూడవ పెళ్లానికా?” అంటూ ఎద్దేవా చేశారు.
Also Read: Women Thieves: షిరిడీ రైలులో మహిళా దొంగలు.. బ్యాగులు మాయం చేసిన కిలేడీలు
అడపా శేషు పవన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. “నీ కుటుంబాన్ని ఎక్కువగా తిట్టింది టీడీపీ వాళ్లే.. ప్యాకేజీ వల్ల ఆ మాటలన్నీ మర్చిపోయుంటావ్. చంద్రబాబు, పరిటాల రవి చేసిన అవమానాలను మర్చిపోయావ్. మహిళలంటే నీకు మరీ అంత చిన్నచూపా. స్త్రీలకు గౌరవం ఇచ్చిన చరిత్ర పవన్‌కు లేదు. ప్రతీ సంక్షేమ పథకంలో మహిళలకు జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు. సోషల్ మీడియాలో జనసేన పార్టీ శ్రేణులు చేస్తున్న అరాచకాలను బయటపెడతాం. నిన్ను రెండు చోట్లా ఓడించింది టీడీపీ పార్టీ కాదా. రేపు మళ్లీ నిన్ను ఓడించేది కూడీ టీడీపీనే” అని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు అన్నారు.