AP NEWS: వారాహి రోడ్డెక్కే సమయం ఆసన్నమైంది. వారాహి కోసం, వారాహిలో వచ్చే పవన్ కల్యాణ్ ఎప్పుడెప్పుడు రోడ్డుపైకి వచ్చి ప్రచారంలో పాల్గొంటారా అని.. అటు జనసైనికులతో పాటు పవన్ కల్యాణ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పవన్ వారాహిపై ప్రచారంపై మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో గోదావరి జిల్లాల నేతలతో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ త్వరలో చేపట్టే వారాహి యాత్ర పై ప్రత్యేకంగా చర్చించారు. పవన్ ప్రచారానికి రూట్ మ్యాప్‌ని ఇప్పటికే సిద్ధం చేసారు. ఈనెల 14 నుంచి వారాహి యాత్ర ప్రారంభమవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ ప్రచార యాత్ర ఉభయ గోదావరి జిల్లాల్లో షెడ్యూల్ ఖరారు చేశారు. క్షేత్ర స్థాయిలో సమస్యలను ప్రస్తావించేలా కార్యక్రమాలు ఉండబోతున్నట్లు నాదెండ్ల తెలిపారు. యాత్రలో భాగంగా వివిధ వర్గాలను కలుస్తారని.. ప్రతి రోజూ ఓ ఫీల్డ్ విజిట్ ఉంటుందంటూ నాదెండ్ల మనోహర్ సమావేశంలో తెలిపారు. ఈ ప్రకటనతో జనసైనికుల్లో జోష్ వచ్చేసింది.
Read Also: Richard rishi : కూతురు వయసున్న హీరోయిన్ తో నటుడు ప్రేమాయణం?
అయితే పవన్ ఎన్నికల ప్రచారం కోసం వారాహిని ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. చుట్టూ ప్రత్యేక లైటింగ్ తో పాటు వెరీ హైఎండ్ సెక్యూరిటీ సిస్టమ్‌ను ఫిట్ చేశారు. సభల్లో పవన్ ప్రసంగం స్పష్టంగా వినిపించేలా లేటెస్ట్ సౌండ్ సిస్టం, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రికార్డయ్యే ఫుటేజ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వర్‌కి రియల్ టైంలో వెళ్లేలా ప్రజెంట్ టెక్నాలజీతో ఉపయోగించారు. వాహనం లోపల పవన్ కల్యాణ్ తో పాటు మరో ఇద్దరు కూర్చొని చర్చించుకునేలా.. అలాగే హైడ్రాలిక్ లిప్ట్ ద్వారా పవన్ వాహనం పైకి చేరుకునేలా సిస్టం అమర్చారు. అంతకుముందు వారాహి వాహనం రంగుపై పెను సంచలనమైన విషయం తెలిసిందే. ఆర్మీ వాహనాలకు ఉపయోగించే ఆలివ్ గ్రీన్ రంగును వినియోగించారంటూ విమర్శలు వచ్చాయి. కానీ అది నిబంధనలకు అనుగుణంగానే ఉందని తెలంగాణ రోడ్డు ట్రాన్స్ పోర్టు అధికారులు స్పష్టం చేశారు.
Read Also: Tirumala Ghat Road Accidents: తిరుమల ఘాట్ రోడ్డులో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. భక్తుల్లో భయం
వారాహికి తొలిసారిగా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో పవన్ కల్యాణ్ పూజలు చేయించారు. ఆ తరువాత విజయవాడ వచ్చి దుర్గమ్మ సన్నిధిలోను ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా దుర్మమ్మకు పవన్ కల్యాణ్ చీర, సారె సమర్పించారు. ఆ తరువాత వారాహి వాహనాన్ని మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉంచారు. ఈ క్రమంలో ఇక పవన్ కల్యాణ్ వారాహిపై జనాల్లోకి రానున్నారు. దీంతో జనసైనికులు ఫుల్ జోష్ లో ఉన్నారు.