Montenegro mass shooting: బాల్టిక్ దేశం మాంటెనెగ్రోలో దారుణం జరిగింది. సిటింజే సిటీలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. ఏకంగా 11 మందిని హతమర్చాడు. వేటాడే తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు కూడా మరణించాడు. ఈ ఘటనలో మొత్తం 12 మంది మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు. మాంటెనెగ్రో పోలీస్ డైరెక్టర్ జోరన్ బ్రిడ్జానిన్ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం 34 ఏళ్ల వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు.
Two Sets Of Twins: చాలా మందికి ఒక కాన్పులో కవలలు పుట్టడం సహజంగా జరిగేదే. అయితే బోస్టన్‌లో విచిత్రం చోటు చేసుకుంది. యాష్లీ నెస్ అనే 35 ఏళ్ల మహిళ జూలై28న ఓకేసారి జంట కవలలకు జన్మనిచ్చింది. ఒకే తీరుగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు మొత్తం నలుగురు చిన్నారులు పుట్టడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇలా జంట కవలలు(ఐడెంటికల్ ట్విన్స్) పుట్టడం కోటి మందిలో ఒక్కరికే జరుగుతుందని వైద్యులు స్పష్టం…
America: అగ్రరాజ్యం అమెరికాలో మొత్తం 582 స్టార్టప్ కంపెనీలు ఉండగా అందులో సగానికి పైగా అంటే 319 సంస్థల వ్యవస్థాపకుల్లో కనీసం ఒక్కరైనా ఇతర దేశాల వాళ్లు ఉన్నారు. అందులోనూ ఇండియన్లే ఎక్కువ మంది ఉండటం విశేషం.
Escape mid air collision: విమాన ప్రయాణాల్లో ప్రతీది పక్కాగా కాలిక్యులేట్ చేయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా జరిగే ప్రమాదాలు భారీగా ఉంటాయి. హ్యుమన్ ఎర్రర్, సాంకేతిక లోపాలు తెలత్తితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. తాజాగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చేసిన చిన్న తప్పిదం పెద్ద ప్రమాదానికి కారణం అయ్యేదే. ఆకాశంలోనే రెండు విమానాలు ఢీకొట్టే ప్రమాదం ఏర్పడింది.
మరోసారి అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇటీవల కాలంలో తుపాకీ కాల్పుల ఘటనల్లో అమాయకులు మరణిస్తున్నారు. తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది. శనివారం తెల్లవారుజామున సీటెల్ శివారు రెంటల్ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు.
యూరప్ లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అనేక దేశాలు అల్లాడుతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ లో కనీవిని ఎరగని స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో జనాలు అల్లాడుతున్నారు. ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం దేశంలో రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో పాటు ఎమర్జెన్సీని విధించింది. లండన్ లోని హీత్రూలో దేశంలో ఇప్పటి వరకు లేని విధంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. అంతకుముందు ఆగ్నేయ ఇంగ్లాండ్ సర్రే ప్రాంతంలో నమోదైన 39 డిగ్రీల ఉష్ణోగ్రతను బద్దలు కొట్టింది. సోమవారం లండన్…
తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో శ్రీలంక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన నాయకుడే పరారయ్యాడు. ప్రజలు నిరసనల మధ్య శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులు..అక్కడ నుంచి సింగపూర్ కు వెళ్లాడు. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. రాజపక్స రాజీనామా చేయడంతో శ్రీలంకలో ప్రజలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను తగ్గించారు. ప్రభుత్వ భవనాలను కూడా ఆందోళనకారులు ఖాళీ చేశారు. ఈ రోజు శ్రీలంక పార్లమెంట్ సమావేశం కాబోతోంది. కొత్త అధ్యక్షుడి…
అగ్రరాజ్యం అమెరికాను నత్తలు వణికిస్తున్నాయి. అయితే అవి సాధారణ నత్తలు కావు. వ్యాధులను సక్రమింపచేసే నత్తలు. ఆఫ్రికా వాటి పుట్టినిల్లు. జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్ జాతి నత్తలు సైజులో చాలా పెద్దగా ఉంటాయి. వాటి సైజు 8 అంగుళాలు ఉంటుంది. పెద్దవాళ్లు పిడికిలి బిగిస్తే ఎంత ఉంటుందో అంత సైజులో నత్త ఉంటుంది. ఈ నత్తలు నీటిలో కాకుండా భూమిపై మొక్కలు, చెట్ల ఆకులను తింటూ బతుకుతుంటాయి. అయితే ఓడల్లో సరుకుల ద్వారానో లేదా మనుషుల…
శ్రీలంకలో అధ్యక్షుగు గొటబయ రాజపక్స మాల్దీవులకు పారిపోయాడు. తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న ద్వీపదేశంలో శనివారం నుంచి మళ్లీ ఉవ్వెత్తున ఆందోళను ఎగిసిపడ్డాయి. దీంతో గొటబయ రాజపక్స అధ్యక్ష భవనాన్ని వదిలి పరార్ అయ్యారు. తాజాగా ఆయన తన భార్య, ఇద్దరు బాడీగార్డులతో మాల్దీవులకు చేరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడో వార్త భారత్ ను ఆందోళనకు గురిచేసింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశాన్ని వదిలిపోవడానికి భారత్ సహకరించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడి మీడియా ఈ…
దాయాది దేశం పాకిస్తాన్ లో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లో ఈ ప్రమాదం జరిగింది. టూరిస్టులతో వెళ్తున్న వాహనం జారి లోయలో పడింది. దీంతో 11 మంది మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. వాయువ్య పాకిస్తాన్ లోని ఖైబర్ ప్రావిన్స్ ప్రకృతి అందాలకు నెలవు. అక్కడ ఉంటే స్వాత్ లోయ ప్రపంచంలోనే అందమైన ప్రదేశాల్లో ఒకటిగా ఉంది. ఈ…