Montenegro mass shooting: బాల్టిక్ దేశం మాంటెనెగ్రోలో దారుణం జరిగింది. సిటింజే సిటీలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. ఏకంగా 11 మందిని హతమర్చాడు. వేటాడే తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు కూడా మరణించాడు. ఈ ఘటనలో మొత్తం 12 మంది మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు. మాంటెనెగ్రో పోలీస్ డైరెక్టర్ జోరన్ బ్రిడ్జానిన్ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం 34 ఏళ్ల వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు.
8 ఏళ్లు, 11 ఏళ్ల పిల్లలతో పాటు ఇద్దరు తోబుట్టువులను, వారి తల్లిని చంపాడు. సదరు కుటుంబం, ఘటనకు పాల్పడిన వ్యక్తి అంతా ఒకే ఇంట్లోనే ఉంటున్నారు. కాల్పులకు సరైన కారణాలు ఇంకా పోలీసులు గుర్తించలేదు. ఈ దాడి జరిగిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన దుండగుడు మరో ఏడుగురిని కాల్చి చంపాడు. ఈ ఘటనలో ఓ పోలీస్ కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పోలీసులు కాల్పుల్లో దుండగుడు మరణించాడు. కాల్పుల ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా 9 మంది అక్కడిక్కడే మరణించగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలించే మార్గంలో మరణించారు.
Read Also: Pavan Tej: ఘనంగా హీరోయిన్ తో మెగా వారసుడి నిశ్చితార్థం
మెక్సికోలో గ్యాంగ్ వార్:
మెక్సికోలో మరోసారి గ్యాంగ్ వార్ జరిగింది. సియూడాడ్ వారెజ్ లో ఓ దుకాణం వెలుపల వార్తల్ని కవర్ చేస్తున్న రేడియో ఉద్యోగులను నలుగురిని హతమర్చారు మెక్సికన్ గ్యాంగ్. ఈ ఘటనలో నలుగురు రేడియో ఉద్యోగులతో సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మెక్సికన్ గ్యాంగ్స అంతకుముందు గురువారం రోజున మెక్సికో సరిహద్దులోని ఓ జైలుపై దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు ఖైదీలు మరనణించడంతో పాటు మరో 20 మంది ఖైదీలు గాయపడ్డారు. మొత్తం మెక్సికోలో ఈ గ్యాంగ్ వార్ల కారణంగా రెండు రోజుల్లో 11 మంది మరణించారు. అయితే ఎలాంటి గ్యాంగ్స్ లో సభ్యులుగా లేని అనేెక మంది సాధారణ, అమాయక పౌరులను కాల్చిచంపడంపై మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఓబ్రాడార్ విచారం వ్యక్తం చేశారు.