ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో పలు వీసాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూలను అమెరికా విదేశాంగ శాఖ తాత్కాలికంగా రద్దు చేసింది. నాన్ ఇమ్మిగ్రెంట్ వర్క్ వీసా హెచ్1బీతో పాటు హెచ్3, హెచ్4 వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ రద్దు వర్తిస్తుందని తెలిపింది. వచ్చే ఏడాది 2022 వరకు వీటిని రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. దీనిపై స్థానిక పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతీయ కాన్సులేట్/ఎంబసీ అధికారులు తుది…
ఫిలిప్పీన్స్ దేశాన్ని రాయ్ తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. తుఫాన్ ప్రభావంతో మరణించిన వారి సంఖ్య 375కి చేరింది. ఇప్పటికే తుఫాన్ సృష్టించిన విలయానికి వేల సంఖ్యలో ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. ఈ తుఫాన్ ధాటికి విద్యుత్ వ్యవస్థ ధ్వంసం కావడంతో ఫిలిప్పీన్స్‌లో అంధకారం నెలకొంది. దేశవ్యాప్తంగా 8 లక్షల మందిపై రాయ్ తుఫాన్ ప్రభావం చూపిందని అధికారులు వెల్లడించారు. Read Also: ఆ మాత్రం దానికి బట్టలు వేసుకోవడం…
స్విటర్లాండ్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. నొప్పి లేకుండా చావాలని కోరుకునేవారి కోసం అక్కడి సైంటిస్టులు ఓ మిషన్‌ను కనిపెట్టగా దానికి చట్టబద్ధతను స్విట్జర్లాండ్ ప్రభుత్వం కల్పించింది. వివరాల్లోకి వెళ్తే.. ఎవరైనా మానసికంగా కుంగిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తారు. ఆత్మహత్య కోసం ఉరి వేసుకోవడం లేదా కాల్వలో దూకడం లేదా రైలుపట్టాల కింద పడటం లాంటి చర్యలకు పాల్పడతారు. అయితే ఇకపై అలాంటి చర్యలకు పాల్పడకుండా నొప్పి లేకుండా నిమిషంలోనే చనిపోయేలా స్విట్జర్లాండ్‌లోని సైంటిస్టులు ఓ పరికరాన్ని…
తాలిబాన్ ఆధ్వర్యంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం జాతీయ బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ వలీ హక్మల్ తెలిపారు. ఈ బడ్జెట్ కోసం రెండు దశాబ్దాలలో మొదటిసారిగా విదేశీ సహాయం లేకుండా నిధులుసమకూరుస్తున్నట్లు ఆయన చెప్పారు. డిసెంబర్ 2022 వరకు అమలయ్యే బడ్జెట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కూరుకుపోయిన ఆప్ఘాన్‌కు ఈ బడ్జెట్ చాలాముఖ్యమైనది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక చాలా బ్యాంకులు మూతపడ్డాయి. నిత్యావసర సరుకులు భగ్గుమంటున్నాయి.…
ఆప్ఘనిస్తాన్‌లో నిత్యావసర ధరలు చుక్కలను అంటుతున్నాయి. అమెరికా డాలర్‌తో పోల్చుకుంటే ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఆఫ్ఘనీ విలువ రోజురోజుకు పడిపోతుండటమే అక్కడ నిత్యావసర ధరలు పెరగడానికి కారణమని తెలుస్తోంది. దీంతో అక్కడ ఏ వస్తువు ధర చూసినా గుండె గుభేల్ అంటోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజలు అయితే నిత్యావసరాలను కొనుగోలు చేయలేక ఉన్న డబ్బులతో ఒకపూట తిని ఒక పూట పస్తులు ఉంటున్నారు. Read Also: ఆకాశాన్నంటిన మునగాకాయ ధరలు ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ దేశంలో…
రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన భారత పర్యటన ఖరారైంది. భారత్- రష్యా దేశాల మధ్య జరిగే 21వ వార్షిక సమావేశంలో భాగంగా వచ్చే నెల 6న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి రానున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ భేటీలో ఆయన ప్రధాని మోదీతో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలను చర్చించనున్నట్లు తెలిపింది. అలాగే ఇరుదేశాల విదేశాంగ, రక్షణ మంత్రులు కూడా భేటీ కానున్నట్లు పేర్కొంది. Read Also: కొత్త…
ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు పాలన ప్రారంభించి 100 రోజులు పూర్తయింది. అమెరికా బలగాలు ఆప్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోవడంతో తాలిబన్లు అక్కడి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని తమ చేతుల్లో తీసుకుని పాలించడం మొదలుపెట్టారు. తాలిబన్లు అధికారంలోకి రావడంతో అఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి దయనీయంగా తయారైంది. ముఖ్యంగా మహిళల హక్కులను తాలిబన్లు హరించివేస్తున్నారనే అపవాదు వచ్చింది. మీడియాపైనా తాలిబన్లు పలు రకాల ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో పలువురు పౌరులు దేశాన్ని విడిచి…
రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. బెలారస్ దేశానికి చెందిన కార్గో విమానం కూలిపోయిన ఘటనలో ఏడుగురు స్పాట్ డెడ్ అయినట్లు అధికారులు ప్రకటించారు. రష్యాలోని తూర్పు సెర్బియాలో ఎఏన్-12 విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. Read Also: తాలిబన్లు మరో సంచలన నిర్ణయం: అమెరికాను దెబ్బకొట్టేందుకు… ఈ ఘటనకు ప్రతికూల వాతావరణమే కారణమని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని…