UK Heatwave: బ్రిటన్ లో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. అల్లాడుతున్న ప్రజలు.. రైళ్లు బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూరప్ లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అనేక దేశాలు అల్లాడుతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ లో కనీవిని ఎరగని స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో జనాలు అల్లాడుతున్నారు. ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం దేశంలో రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో పాటు ఎమర్జెన్సీని విధించింది. లండన్ లోని హీత్రూలో దేశంలో ఇప్పటి వరకు లేని విధంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. అంతకుముందు ఆగ్నేయ ఇంగ్లాండ్ సర్రే ప్రాంతంలో నమోదైన 39 డిగ్రీల ఉష్ణోగ్రతను బద్దలు కొట్టింది. సోమవారం లండన్ వ్యాప్తంగా వడగాలల తీవ్రత ఎక్కువగా కనిపించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బ్రిటన్ లో వేడి బాధ నుంచి తప్పించుకోవడానికి నదులు, సరస్సులకు వెళ్లి ఇప్పటివ వరకు ఐదుగురు మరణించారు.
మంగళవారం ఇంగ్లాండ్ లో 41 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు అయింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రయాణాలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కొన్ని చోట్ల రహదారులను మూసేస్తున్నారు. రెడ్ జోన్ గుండా ప్రయాణించే రైళ్లను బంద్ చేసింది అక్కడి ప్రభుత్వం. యూకే రైల్ నెట్ వర్క్ ఈ తీవ్రమైన వేడిని తట్టుకోలేకపోతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. సోమవారం తూర్పు ఇంగ్లాండ్ లోని సఫోల్క్ లో గరిష్టంగా 38.1 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు అయింది. స్కాట్లాండ్, వేల్స్ లో కూడా సోమవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
Read Also: Srilanka Crisis: శ్రీలంక సంక్షోభంపై జై శంకర్ నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్
ముఖ్యంగా బ్రిటన్ వ్యాప్తంగా రైల్ నెట్ వర్క్ పై ప్రభావం ఏర్పడింది. 40 డిగ్రీల వేడిలో ట్రాక్ ఉష్ణోగ్రత 50,60 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉండటంతో.. రైళ్లు పట్టాలు తప్పే అవకాశం ఉంటుందని రైల్వే శాఖ వెల్లడించింది. మామూలుగా బ్రిటన్ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే అక్కడి వాతావరణ పరిస్థితికి అనుకూలంగా రైల్వే ట్రాక్, రోడ్లు, రన్ వేల నిర్మాణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో లూటన్ ఎయిర్ పోర్ట్, రాయల్ ఎయిర్ ఫోర్స్, బ్రైజ్ నార్టన్ లోని రన్‌వేలు వేడికి ప్రభావితం కావడంతో విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. బ్రిటన్ వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు