Two Sets Of Twins: చాలా మందికి ఒక కాన్పులో కవలలు పుట్టడం సహజంగా జరిగేదే. అయితే బోస్టన్‌లో విచిత్రం చోటు చేసుకుంది. యాష్లీ నెస్ అనే 35 ఏళ్ల మహిళ జూలై28న ఓకేసారి జంట కవలలకు జన్మనిచ్చింది. ఒకే తీరుగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు మొత్తం నలుగురు చిన్నారులు పుట్టడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇలా జంట కవలలు(ఐడెంటికల్ ట్విన్స్) పుట్టడం కోటి మందిలో ఒక్కరికే జరుగుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇంకో విశేషమేంటంటే డాక్టర్లిచ్చిన డెలివరీ డేట్ కంటే 12 వారాల ముందుగానే జంట కవలలు పుట్టారు.
Read Also: UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో కొత్త చరిత్ర
కాగా యాష్లీ నెస్‌కు గతంలో ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత నాలుగు సార్లు గర్భస్రావం జరిగాక ఆమె ప్రస్తుతం నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. జంట కవలలు పుట్టాలంటే రెండు అండాలు రెండు వేరువేరు శుక్రకణాలతో ఫలదీకరణం చెందాలి. ఆ తరువాత ఆ అండాలు రెండుగా విభజితమైతే ఇలా జంట కవలలు పుడతారని వైద్యులు చెబుతున్నారు. గతంలో కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళ వేర్వేరు రోజుల్లో కవలలకు జన్మినిచ్చింది. ఆమె 15 నిమిషాల తేడాతో కవలలకు జన్మనిచ్చింది. ముందుగా బాబు 2021 డిసెంబర్ రాత్రి 11.45 గంటలకు జన్మిస్తే… 15 నిమిషాల తరువాత 2022 జనవరి ఒకటిన అర్ధరాత్రి పన్నెండుకు పాప జన్మించింది. ఇండియాలోనూ 2019 డిసెంబర్ 31న ఇలాంటి అరుదైన సంఘటన జరిగింది. కాకపోతే పిల్లలిద్దరికి 30 నిమిషాలు గ్యాప్ ఉంది.